ఈ క్రమంలోనే పరిశోధకులు చేస్తున్న అధ్యాయనాల్లో కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా ఈ సెకండ్ వైరస్ లక్షణాలు మొదటి రకం వైరస్ తో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉండటంతో అటు జనాలను కలవరపెడుతున్నాయి. అదే సమయంలో ఇక శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల్లో కూడా రోజు రోజుకు కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నాయి.ఇప్పటికే తల నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వాంతులు విరేచనాలు లాంటివి కరోనా వైరస్ లక్షణాలు గా గుర్తించారు పరిశోధకులు. ఇటీవల జరిగిన అధ్యయనంలో మరికొన్ని కొత్త విషయాలను కూడా గుర్తించారూ.
తీవ్ర నిరసం రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య ఒక్కసారిగా భారీగా తగ్గి పోవడం కూడా కరోనా వైరస్ ప్రాథమిక లక్షణంగా భావించాల్సి ఉంటుంది అంటూ ఇటీవలే ఉత్తరప్రదేశ్కు చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా లక్షణాలతో ఎంతో మంది రోగులు తమ వద్దకు వచ్చి కరోనా వైరస్ పరీక్ష చేసుకోగా ఇక వారికి పాజిటివ్గా నిర్ధారణ అయింది అంటూ వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి లక్షణాలను సత్వరం గుర్తించి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోకపోతే ఇక ఆ తర్వాత జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపించి ఇక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెబుతున్నారు పరిశోధకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి