ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రేపు పలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది ఈ పోలింగ్ కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటికే ఎన్నికల ప్రచారం పోలింగ్ కారణంగానే కేసులు పెరిగిపోయాయి అని విమర్శలు వస్తున్న వేళ ఇక ఇటీవల ఒక డాక్టరు కూడా ఇదే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాడు. రేపు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వినూత్నంగా నిరసన కు దిగాడు. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు వైద్యుడు
ప్లకార్డు పట్టుకుని ఓటుకు రాకు కరోనా వైరస్ తో ఖతం అయిపోకు అంటూ నిరసన తెలిపాడు. ఓవైపు కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ ఉంటే ఈ సమయంలో ఎన్నికలు అంత ముఖ్యం అయ్యా అంటూ ప్రశ్నించాడు. మీమందరం ప్రాణాలను లెక్కచేయకుండా కరోనా వైరస్ తో పోరాటం చేస్తూ ఉంటే మీ స్వార్థం కోసం ఎన్నికల నిర్వహించి తద్వారా ఎంతో మందిని బలి తీసుకోవడం మంచిదేనా అంటూ ప్రశ్నించాడు . అయితే ఇక ఈ వైద్యుడు నిరసన చూసి ఇది నిజమే కదా అని అనుకుంటున్నారు అందరు. మరి ఈ వైద్యుడు చేసిన నిరసన రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పై ఎంత ప్రభావం చూపుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి