దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది మొదటి రకం కరోనా వైరస్ తో పోలిస్తే రెండవ రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమే కాదు  మరింత దారుణంగా ప్రభావం కూడా చూపుతోంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోవడమే కాదు ఎంతో మంది కరోనా వైరస్ రోగులు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.  దేశంలో ప్రతి రోజూ నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి అంటే ఇక పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయింది అర్థం చేసుకోవచ్చు. పలు రాష్ట్రాలలో అయితే విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తూ  నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి.



 అయితే కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వైరస్ పై మరింత అవగాహన తెచ్చుకోవడం ఎంతో అవసరం అంటూ నిపుణులు సూచిస్తున్నారు.   వైరస్ కు ముందు సోకిన తర్వాత..  వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై ప్రతి ఒక్కరు పూర్తి స్థాయి అవగాహనతో ఉండడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు.  ఒకసారి కరోనా వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.  వైరస్ తగ్గిపోయింది కదా ఇంకా ఏం కాదులే అని భావిస్తూ ఉంటారు.



 అలా నిర్లక్ష్యం మాత్రం అసలు చేయవద్దు అని సూచిస్తున్నారు నిపుణులు. వైరస్ తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులపాటు వైరస్ ఇన్ఫెక్షన్ బాడీలో ఉండే అవకాశం ఉంటుందని అందుకే నెగిటివ్  వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులపాటు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా ఆవిరి పట్టడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తొలగి పోతాయి అని చెబుతారు శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. ప్రతిరోజూ రెండు లేదా మూడు సార్లు ఇలా ఆవిరి పట్టుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు అయితే కరోనా వైరస్ సోకినప్పుడు వాడిన మల్టీ విటమిన్ టాబ్లెట్స్ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని మళ్లీ మునుపటిలా ఉత్సాహంగా దృడంగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: