భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఒక తీవ్రమైన ఘ‌ట‌న మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హ‌త్య‌. దీనికి కార‌కుడు ప్రభాకరన్. ఈయ‌న చాలా ప్రమాదకరమైన వ్య‌క్తిగా అనేక విష‌యాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఒసామా బిన్ లాడెన్ ఆదేశాలతో అప్ప‌ట్లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేయడానికి ముందే ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రభాకరన్ అనుచరులు కొలంబోలోని జనావాసాల్లో ఎన్నో భవనాలను నేల‌మ‌ట్టం చేశారు.

ప్రభాకరన్‌కు ఉన్న ఒకే సిద్ధాంతం తమిళ జాతీయవాదం అనేది మాత్ర‌మే. ప్రభాకరన్ ఎల్టీటీఈని పది వేల మంది సైన్యం ఉన్న ఒక సంస్థగా కేవ‌లం ఒక్క ద‌శాబ్దంలోనే మార్చి సంచ‌ల‌నం సృష్టించారు. దాదాపు ఆ సంస్థ‌ను ఒక దేశ సైన్యానికే స‌మానంగా నిలిపారు. ఒక బాంబు పేలుడులో ప్ర‌భాక‌ర‌ణ్ కుడి కాలు కాలు నల్లగా మాడిపోయింది. దీంతో ఆయ‌న‌కు కరికాలన్ అనే పేరు వ‌చ్చింద‌ని స‌మాచారం. ప్రభాకరన్ మదివదని ఇరంబు అనే అమ్మాయిన పెళ్లాడారు.

కాగా 1986లో భారత్ తోపాటు శ్రీలంక మ‌ద్య ఒప్పందంపై చర్చలు జ‌రుగుతున్న‌ప్పుడు ప్రభాకరన్‌ను ఢిల్లీ తీసుకురావడానికి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ రెండు హెలికాప్టర్లను జాఫ్నా కు పంపించింది. అయితే అందులో ఇండియన్ ఫారిన్ సర్వీస్ సీనియర్ అధికారి అయిన హర్దీప్ సింగ్ పురి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆయ‌నే ఇప్పుడు ప్ర‌ధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా కొన‌సాగుతున్నారు.

అయితే చెన్నై విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌కు వారు వ‌చ్చినే త‌ర్వాత ప్రభాకరన్‌కు ఇష్టమని హర్దీప్ పురి చికెన్ కర్రీ వండించి మ‌రీ దానితోపాటు అన్నం కూడా తెప్పించారు. కానీ ప్రభాకరన్ మాత్రం దాన్ని తిన‌లేదు. ట్రిగ్గర్ నొక్కే త‌న వేలికి ఆ ప్రభావం పడుతుంద‌ని వ‌ద్ద‌న్నారు. దీంతో ఢిల్లీ చేరిన తర్వాత ప్రభాకరన్‌ను అశోకా హోటల్‌లో ఉంచారు అప్ప‌టి అధికారులు. ఈ ప్ర‌భాక‌ర‌నే త‌ర్వాత రాజీవ్ గాంధీ మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యాడు. అంటే అతి పెద్ద తీవ్ర‌వాదికి ఇప్ప‌టి మంత్రి చికెన్ క‌ర్రీ వండించాడ‌న్న మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: