కొద్ది రోజుల క్రింద‌ట జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో అసాంతం ధీమాగా ఉన్నారు. జ‌గ‌న్ గ‌తంలో ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు ఆయ‌న‌లో క‌నిపించ‌ని ధీమా ఇప్పుడు ఉండ‌డం ఏంట్రా బాబు అన్న‌ది చాలా మందికి అంతుప‌ట్ట లేదు. గ‌తంలో బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు జ‌గ‌న్‌తో మాట్లాడిన‌ప్పుడు ఆదేశించిన‌ట్టే వారి మాట‌లు ఉండేవ‌న్న‌దే మీడియా టాక్ ?  అస‌లేం ఉంద‌బ్బా జ‌గ‌న్‌ను ఢిల్లీలో ప‌ట్టించుకున్న వాళ్లే లేర‌ని ఇక్క‌డి టీడీపీ మీడియా పుంఖాను పుంఖాలుగా వార్త‌లు వండి వార్చేది. క‌ట్ చేస్తే తాజా ప‌ర్య‌ట‌నను మ‌రీ అంత బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నం తెలుగుదేశం అనుకూల మీడియా చేయ‌లేదు. ఇటు ఢిల్లీ నుంచి వ‌చ్చాక జ‌గ‌న్‌లోనూ, అటు వైసీపీ వ‌ర్గాల్లోనూ ఓ కొత్త ధీమా ఉన్న ప్ర‌చార‌మే ఎక్కువుగా జ‌రుగుతోంది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం జ‌గ‌న్‌తో పెట్టుకోవ‌డం కంటే జ‌గ‌న్‌తో స‌ఖ్య‌త‌గా ఉంటేనే బెట‌ర్ అని బీజేపీ జాతీయ వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. ఏపీలో చంద్ర‌బాబు కంటే జ‌గ‌న్‌కే ఎక్కువ క్రేజ్ ఉంది.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో టీడీపీ పుంజుకోవ‌డం.. చంద్ర‌బాబు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అవ్వ‌డం అన్న‌ది క‌ష్ట‌మే అని ఆ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంటులో వైసీపీ బ‌లం ఎక్కువుగా ఉంద‌ని.. ఇది త్వ‌ర‌లోనే మ‌రింత పెరుగుతుంద‌ని.. జ‌గ‌న్‌తో స‌ఖ్య‌త‌తో ఉంటేనే మంచిద‌ని భావిస్తున్నార‌ట‌.

మండ‌లిలో 8 మంది స‌భ్యులు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డంతో వైసీపీ బ‌లం పెరిగి.. టీడీపీ బ‌లం ప‌డిపోయింది.. ఇప్పుడు అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి త్వ‌ర‌లోనే రానుంది. వ‌చ్చే జూన్లో ఏపీ నుంచి న‌లుగురు  రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో ఒకరు వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి కాగా.. మిగిలిన ముగ్గురు బీజేపీలో ఉన్న సురేష్ ప్ర‌భు, టీజీ వెంక‌టేషే. ఏపీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండ‌డంతో.. ఈ నాలుగు రాజ్య‌స‌భ సీట్లు వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి.

రాజ్య‌స‌భ‌లో బిల్లులు పాస్ కావాలంటే 123 సీట్లు కావాలి.. కానీ ప్ర‌స్తుతం బీజేపీకి అక్క‌డ 93 మంది స‌భ్యులే ఉన్నారు. పైగా ప‌లు రాష్ట్రాల్లో ఆ పార్టీ వ‌రుస‌గా ఓడిపోతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే లోక్‌స‌భలో 22 మంది ఎంపీలు, రాజ్య‌స‌భ‌లో 10 మంది ఎంపీలు ( భ‌విష్య‌త్తులో కూడా క‌లిపితే) ఉండే వైసీపీతో అన‌వ‌స‌రంగా గొడ‌వ పెట్టుకోవ‌డం.. అవ‌న‌స‌రం అన్న‌దే బీజేపీ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే ఆ పార్టీ జాతీయ నాయ‌కులు సైతం జ‌గ‌న్‌ను సైలెంట్‌గా దువ్వుతోన్న ప‌రిస్థితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: