తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డికి పార్టీల‌తో సంబంధం లేకుండా క్రేజ్ ఉంది. ఇప్పుడు ఇత‌ర పార్టీల్లో ఉన్న రేవంత్ అనుచ‌రులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తోన్న ప‌రిస్థితి ఉంది. తెలంగాణ‌లో అక్క‌డ‌క్క‌డా టీడీపీకి కేడ‌ర్ ఉంది. వీళ్లంతా రేవంత్‌కు అనుచ‌రులుగానే ఉన్నారు. వీరు ఇప్పుడు కాంగ్రెస్ లోకి జంప్ చేసే ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఇప్ప‌ట‌కీ టీడీపీకి మంచి కేడ‌ర్ ఉంది. వారు గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డికి స‌పోర్ట్ చేశారు. ఆ మాట‌కు వ‌స్తే రేవంత్ మల్కాజ్ గిరి ఎంపీగా 10 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించారు. టీడీపీ కేడ‌ర్ రేవంత్ గెలుపు కోసం ఎంతో స‌పోర్ట్ చేసింది.

ఆంధ్రా సెటిల‌ర్లు సైతం రేవంత్‌కు అక్క‌డ ఎప్పుడూ స‌పోర్ట‌ర్స్ గా ఉంటూ వ‌స్తున్నారు. ఇక రేవంత్‌కు ముఖ్య అనుచ‌రుడిగా ఉన్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన కార్యదర్శి, కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ముప్పిడి మధుకర్ టీడీపికి గుడ్ బై చెప్పేసి హ‌స్తం గూటికి చేరే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మ‌ల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డికి మధుకర్‌ అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేసిన‌ప్పుడు కూడా ఆయ‌న కాంగ్రెస్ అభ్య‌ర్థుల గెలుపు కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు.

ఇక గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మల్కాజ్ గిరిలో రేవంత్ ను గెలిపించేందుకు మ‌ధుక‌ర్‌ ఎంతో కష్టపడ్డారు. విచిత్రం ఏంటంటే స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు కొంద‌రు లోకల్ ఫిలింగ్‌తో టీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు. మ‌ధుక‌ర్ మాత్రం రేవంత్ వెంటే ఉన్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్ రాజ‌కీయంగా అనేక ఇబ్బందుల్లో ఉండ‌డంతో మ‌ధుక‌ర్ ఒక్క‌రు మాత్ర‌మే కాదు.. చాలా మంది నేత‌లు సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు వీరంతా రేవంత్ ఏకంగా పీసీసీ అధ్య‌క్షుడు అవ్వ‌డంతో తిరిగి రాజ‌కీయంగా యాక్టివ్ అవ్వ‌డంతో పాటు కాంగ్రెస్‌లో త‌మ అదృష్టం ప‌రీక్షించుకోనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: