తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవకు త్వరలో గిర్ గోవులు సిద్ధమయ్యాయి. శ్రీవారికి రోజూ సమర్పించే నైవైద్యం, అఖండ దీపారాధన కోసం వినియోగించే నెయ్యి ఇకపై కొండపైనే తయారు చేసి వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది. దేశీ జాతి గోవుల పాలను వినియోగించాలనే నిర్ణయంలో భాగంగా 25గిర్ గోవులు తిరుమలకు చేరుకోనున్నాయి. రవాణా ఖర్చులతో కలిపి ఒక్కో గోవుకు రూ.1.20లక్షలు వెచ్చించారు. వీటిని గుజరాత్ నుంచి తెప్పించారు.

గిర్ జాతి గోవుల పుట్టినిల్లు గుజరాత్. ఇవి ఇక్కడే ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ప్రాధాన్యతను తెలుసుకున్న పలు ఉత్తరాది రాష్ట్రాలు తమ ప్రాంతానికి గిర్ గోవులను తీసుకెళ్తున్నాయి. అక్కడ ఎక్కువగా పెంచుతూ వాటి సంతానాన్ని వృద్ధి చేస్తున్నాయి.  ఈ ఆవుల ప్రయోజనాలను తెలుసుకుంటున్న ప్రజలు.. వాటి నుంచి లబ్ధి పొందుతున్నారు. గిర్ ఆవులు 12 నుంచి 15సంవత్సరాల పాటు బతుకుతాయి. అంతేకాదు ఒక్కో గోవు 6 నుంచి 12 పిల్లలకు జన్మనిస్తుంది.

గిర్ ఆవుల పాలు చాలా శ్రేష్ఠమైనవి. ఇవి రోజుకు12 నుంచి 20లీటర్ల మధురమైన పాలను ఇస్తాయి. అయితే ఇవి ఎక్కువ శాతం పాలు ఇచ్చేందుకు దాణా బాగా వేయాలి. అంతేకాదు వీటికోసం గొడ్ల చావిడి ఏర్పాటు చేసి ఎంతో శ్రద్ధగా చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు గిర్ ఆవులకు ఎలాంటి రోగాలు సోకకుండా ఎప్పటికప్పుడు వెటర్నరీ వైద్యులతో పరీక్షలు చేపిస్తూ జాగ్రత్త పడాలి.

గిర్ జాతి ఆవులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చర్మంపై ఎరుపు లేదా గోధుమ లేదా నలుపు తెలుపు మచ్చలతో కనిపిస్తాయి. వాటి చర్మం చాలా స్మూత్ గా ఉంటుంటి. అంతేకాదు చిన్నచిన్న వెంట్రుకలు ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాయి. ఇక వాటి కొమ్ముల విషయానికొస్తే అవి రాటు దేలి వంగి ఉంటాయి. గంగడోలు చాలా పెద్దదిగా ఉంటుంది అంతేకాదు పొదుగు కూడా దిగబడి ఉంటుంది.

గిర్ జాతి ఆవులు ఎక్కువ శాతం జులై.. సెప్టెంబర్ నెలల మధ్య బిడ్డకు జన్మనిస్తుంటాయి. ఇక ఈ గోవుల్లో రోగనిరోధక శక్తి ఎక్కువ. తద్వారా వీటికి రోగాలు రావడం తక్కువ. వైద్యం ఖర్చుకూడా అంతగా ఉండదు. గిర్ ఆవుల నుంచి వచ్చే నెయ్యి.. పాలు.. మూత్రం ధరలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు సంపాదించుకున్న గిర్ గోవులను శ్రీవారి సన్నిధికి తీసుకొస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: