అయితే.. ఆ విమాన సిబ్బంది కూడా ఏమీ తక్కువ తినలేదు.. ఆ పోకిరీకి తగిన బుద్ది చెప్పారు. విమాన సిబ్బంది అంతా కూడబలుక్కుని.. అతడిపై మెరుపు దాడి చేశారు. ప్లాస్టర్లతో సదరు పోకిరీని కూర్చున్న సీట్లోనే కాళ్లు చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేశారు. చివరకు విమానం లాండ్ అయిన తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ తతంగం అంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మిలియన్ల మంది ఆ వీడియోలు చూసి.. పోకిరీకి బాగా తిక్కకుదిరిందని కామెంట్లు పెడుతున్నారు.
అమెరికాలోని ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళుతున్న విమానంలో ఈ తమాషా ఘటన జరిగింది. మాక్స్‌వెల్ బెర్రీ అనే అమెరికా పోకిరీ ఓ మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆడవాళ్లను తాకరాని చోట తాకుతూ వెకిలి పనులు చేశాడు. అసభ్యంగా కామెంట్ చేశాడు. అంతే కాదు.. ఇదేమిటని ప్రశ్నించిన తోటి ప్రయాణికులతోనూ గొడవకు దిగాడు.. విమాన సిబ్బందిపై దాడికి దిగాడు.
దేనికైనా ఓ హద్దు ఉంటుది కదా.. అందుకే సహనం కోల్పోయిన విమాన సిబ్బంది.. ఆ యువకుడిని సీట్లోనే టేప్ తో కట్టిపడేశాడు. పెద్దగా అరవకుండా నోటికి టేప్ చుట్టేశారు. ఈ ట్విటర్ వీడియోను ఇప్పటివరకు 12.7 మిలియన్లకుపైగా చూశారు. ఇవి చూసి బాగా బుద్ది చెప్పారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి