విశాఖ : బిజెపి పార్టీ రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగు దేశం పార్టీ లో దృశ్యం 2 సినిమా  నడిస్తే... అధికార వైసీపీ పార్టీ పాలనలో గరుడ పురాణం 2 నడుస్తోందని ఎద్దేవా చేశారు జివిఎల్ నరసింహారావు. కానీ వైసీపీ అవలంభిస్తున్న గరుడ పురాణం 2  ఫ్లాప్ అవుతుందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తుందని..  మంత్రి పేర్ని నాని ...బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణమని నిప్పులు చెరిగారు జివిఎల్ నరసింహారావు. 

కేంద్ర ప్రభుత్వం పై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించిన జివిఎల్ నరసింహారావు.. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయమని మండిపడ్డారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ల ప్రభుత్వమే రావాలా?  కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తేనే మంత్రి పదవిలో కొనసాగిస్తారని భావిస్తున్నారా అని నిలదీశారు జివిఎల్ నరసింహారావు.  కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రంలో పర్యటనలో ఉండగా మంత్రుల వ్యాఖ్యలు చేయటం పై అసలు ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు జివిఎల్ నరసింహారావు. డిప్యూటీ సీఎం అమ్ జాద్ భాషా మళ్ళీ టిప్పుసుల్తాన్ భజన ఎందుకు చెస్తున్నారని.. దీని వెనుక కచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. 

వైసిపి కుట్రలు చేస్తుందని.. రాష్త్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణి స్పష్టంగా కనపడతుందని మండిపడ్డారు జివిఎల్ నరసింహారావు . టిడిపి, వైసిపి లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందని.. ఏపిలో నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్థిక వ్యవహారాల పై కేంద్రం జోక్యం చేసుకోదని... కానీ పరిస్థితులు గాడి తప్పితే కచ్చితంగా కేంద్రం జోక్యం ఉంటుందని హెచ్చరించారు. ఏపీలో అసలైన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ అని.. టిడిపి పద్ధతులనే వైసిపి అవలంభిస్తోందని జివిఎల్ నరసింహారావు మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: