దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాంకు సీటు కేటాయించే విషయంలో చంద్రబాబు ఇంకా పూర్తి క్లారిటీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే సొంత నియోజకవర్గంలోనే కోడెల వారసుడుకు తీవ్ర వ్యతిరేకత వస్తుంది. గతంలో అధికారంలో ఉండగా శివరాం సత్తెనపల్లి, నరసారావుపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దందాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ‘కే’ ట్యాక్స్ పేరిట పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ కోడెల శివప్రసాద్‌కు ఇవ్వకూడదని కొందరు టి‌డి‌పి కార్యకర్తలు నిరసన తెలియజేశారు. కానీ చంద్రబాబు ఏదొకవిధంగా సర్దిచెప్పి కోడెలకి సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక అనూహ్య పరిణామాల మధ్య కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల చనిపోయాక సత్తెనపల్లి సీటు విషయంలో మళ్ళీ క్లారిటీ లేకుండా పోయింది.

సత్తెనపల్లి సీటు తనదే అని అక్కడ శివరాం తిరుగుతున్నారు. కానీ కొందరు కార్యకర్తలు మాత్రం శివరాం నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. గతంలో తమనే మోసం చేసి డబ్బులు తీసుకున్నారని, ఈయన వల్లే పార్టీ నాశనమైపోయిందని కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో శివరాంకు సత్తెనపల్లి ఇంచార్జ్ పదవి ఇచ్చే విషయంలో బాబు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలో పరిస్తితులని చక్కదిద్దాలని అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. మరి అక్కడ సమస్య పరిష్కారం అయితే ఓకే...లేదంటే శివరాంకు షాక్ తప్పేలా కనిపించడం లేదు.

పైగా సత్తెనపల్లి సీటు కోసం రాయపాటి సాంబశివరావు వారసుడు రంగబాబు కాచుకుని కూర్చున్నారు. గత ఎన్నికల్లోనే ఈ సీటు రంగబాబు ఆశించారు. కానీ కోడెల ఉండటంతో కుదరలేదు. ఇప్పుడు ఆయన లేరు. అటు శివరాంకు కార్యకర్తలు సపోర్ట్ చేయడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయపాటి, తన వారసుడు కోసం సత్తెనపల్లి సీటు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి సత్తెనపల్లి సీటు చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp