ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్ర వాదానికి మరో రూపమైన తాలిబన్ల పాలన కొన సాగుతుంది. ఇక తాలిబన్లు తాము మంచి వాల్లం.. మారి పోయాము అంటూ స్టేట్మెంట్ లు ఇస్తూనే..  వారి సహజ బుద్ధి చూపిస్తూ మహిళల పై వివక్ష చూపుతున్నారు. ఇక మహిళలపై ఎన్నో ఆంక్షలు విధిస్తూ దారుణం గా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇటీవలే ఆప్ఘనిస్థాన్లో ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వాన్ని అటు అంతర్జాతీయ సమాజం మొత్తం ఎలా చూస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది.  ఉగ్ర వాదాన్ని రూపు మాపేందుకు పోరాటం చేస్తున్న ప్రపంచ దేశాలు ఇక ఇప్పుడు ఉగ్ర వాదానికి మరో రూపం అయిన తాలిబన్ల ప్రభుత్వాన్ని అంగీకరిస్తారా లేదా అన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.


 ఇప్పటికే ఆయుధాల తో ఆధిపత్యాన్ని చేపట్టిన తాలిబన్లకు ఓవైపు చైనా మరో వైపు పాకిస్తాన్ కూడా పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తున్నాయి.  ఇక ప్రపంచ దేశాలు మాత్రం తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేది లేదు అంటూ తేల్చి చెబుతున్నాయి. ఈక్రమంలోనే యూరోపియన్ యూనియన్ ఎలా తాలిబన్ల ప్రభుత్వం విషయంలో నిర్ణయం తీసుకోబోతోందని అనేది హాట్ టాపిక్ గా మారగా ఇక ఇటీవల తాలిబన్లకు యూరోపియన్ యూనియన్ షాక్ ఇచ్చింది అని చెప్పాలి.


 ఇప్పటికే తజకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్లో  తాలిబన్ల ప్రభుత్వానికీ కాకుండా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమృల్లా ప్రభుత్వాన్ని గుర్తిస్తున్నాము అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక ఇటీవల యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ప్రస్తుతం పంజ్ షేర్ దళాలకు నాయకుడు మసూద్ అహ్మద్ కీ పిలుపు నిచ్చింది. యూరోపియన్ యూనియన్  పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాలని ప్రసంగాలు ఇవ్వాలి అంటూ ఆహ్వానం పంపింది.  ఇలా తిరుగుబాటుదారు నాయకుడైన మసూద్ అహ్మద్ కు ఆహ్వానం పంపి ఇక తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించబోము అంటూ యూరోపియన్ యూనియన్ చెప్పకనే చెప్పింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: