ఆమె ఈ ఫిట్ చేసినప్పుడు కొందరు వీడియోలు తీశారు. ఆమె కింద పడటం చూసి వారు షాక్‌కు గురయ్యారు. గాయాలపాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ తలకు బలమైన గాయమవ్వడంతో ట్రీట్‌మెంట్ జరుగుతుండానే ఆమె మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగారు. వీడియో పుటేజ్‌లో ఒక వ్యక్తి ఆమె హార్నెస్ట్ స్ట్రాప్ ఫిక్స్ చేయగా... కెమెరా పట్టుకున్న మరో వ్యక్తి ఐ లవ్ యూ అని చెప్పారు. యెవ్‌జెనియా స్నేహితురాలు కూడా జంగప్ చేయాలనుకుంది. ఉన్నట్టుండి ఈ ఘటన చేయడంతో ఆమె భయానికి గురైంది.
యెవ్‌జెనియా కింద పడిన వెంటనే దాదాపు 12 అడుగులు దొర్లిపోయింది. దీంతో అక్కడ ఉన్న ఒక గోడకు తాకింది. ఆమె తలకు బలమైన గాయమైంది. ఇంతకు ముందే మరోవ్యక్తి కూడా ఇలాగే పడిపోయినట్టు ఓ అధ్యయనంలో తేలింది. అదృష్టవశాత్తు అతను సేప్టీలైన్ తాడును ముందుగానే పట్టుకున్నాడు. అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఈమె సేప్టీ లైన్ తాడును పట్టుకోకపోవడం... తాడు తెగిపోవడం.. అన్ని ఆకస్మాత్తుగా జరిగిపోవడంతో మృతి చెందింది. యెవ్‌జెనియా మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి