దేశంలోనే ఎక్క‌డా లేదు. ల‌క్ష కోట్లు కేవ‌లం సంక్షేమానికి వెచ్చిస్తున్నాడు. ఏడాదికి ల‌క్ష కోట్లు రెండున్న‌రేళ్ల‌లో రెండున్న‌ర ల‌క్ష‌ల కోట్లు.. అప్పుడు మూడున్న‌ర ల‌క్ష‌ల కోట్లు. అంటే ఆదాయ‌మే లేని రాష్ట్రంలో ఈయ‌న తెచ్చిన డ‌బ్బుల్లో అభివృద్ధికి ఈ రెండున్న‌రే ళ్ల‌లో ల‌క్ష కోట్లు వెచ్చించార‌ని అనుకోవాలి మ‌నం. ఉద్యోగుల జీత‌భ‌త్యాల‌కే దిక్కులేని రాష్ట్రంలో అప్పులు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఎవ్వరు ఏమ‌న్నా తాను అనుకున్న‌దే చేసే సీఎం జ‌గ‌న్  ఈ సంక్షోభ నివార‌ణ‌కు ఏం చేస్తారు.. ఏం చేసి అయి నా విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టండ‌ని చెప్ప‌డం సులువు. కానీ అది ఇప్ప‌టికిప్పుడు అనుకున్నంత సాధ్యం కాదు.


డ‌బ్బులుంటే సాధ్యం. ఒడిశా అలా లేదు. తెలంగాణ అలా లేదు. అవి లేవు అంటే విద్యుత్ విష‌య‌మై వారి అనుభ‌వం వారికి ప‌నికి వ‌చ్చింది. మ‌న‌కు మాత్రం సంక్షేమంపై ఉన్న ప్రేమ క‌నీస స్థాయిలో కూడా విద్యుత్ ప్లాంట్ల నిర్వ‌హ‌ణ‌పై లేదు. కొనుగోలు చేసిన విద్యుత్ కూడా సాధార‌ణ ధ‌ర క‌న్నా నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువ. పీక్ అవ‌ర్స్ పేరిట కొనుగోలు చేసిన విద్యుత్ ధ‌ర సాధార ణంగా నాలుగు రూపాయ‌లకు ల‌భిస్తే, త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో 18 నుంచి 20 రూపాయ‌ల‌కు కొనుగోలు చేస్తున్నామ‌ని సంబంధిత అధికారులే చెబుతున్నారు. ఇవ‌న్నీ ఉత్ప‌త్తి రంగాన్ని బాగు చేసేవి కావ‌ని తేలిపోయింది. ఇప్పుడు విద్యుత్ ఉత్ప‌త్తి, దాని స‌ర‌ఫ‌రా అన్న‌ది మ‌రింత భారం అయిపోయింది. ప‌రిస్థితి చేయి దాటిపోయాక జ‌గ‌న్ ఇంకేం చేస్తార‌ని?

సుదీర్ఘ ప్ర‌యాస‌లను త‌ట్టుకుని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ అనుభవ శూన్య‌త కార‌ణంగా రాష్ట్రాన్ని అంధ‌కారంలోకి నెట్టేశాడు. ఇం దులో ఎటువంటి అనుమానామూ లేదు. జ‌ల విద్యుత్ కు సంబంధించిన ప‌వ‌ర్ హౌస్ లను కేంద్రానికి అప్ప‌గించి చేతులెత్తేశాడు. థ ర్మ‌ల్ విద్యుత్ కు సంబంధించి సింగ‌రేణి గ‌నుల‌కు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వ‌కుండా తాత్సారం  చేసి సంబంధిత ఉత్ప‌త్తి యూనిట్ల ను పూర్తిగా ప‌నిచేయ‌నివ్వ‌క, సంక్షోభానికి తావిచ్చాడు. క‌రోనా త‌రువాత ఏ రంగ‌మ‌యినా కోలుకుంటున్న‌దీ అంటే అందుకు కార‌ణం స‌కాలంలో కాస్తో కూస్తో విద్యుత్ ఉండ‌డమే. ఇదంతా నిన్న‌టి మాట. చిన్న చిన్న ఉత్ప‌త్తి రంగాల‌ను పూర్తిగా కుదేలు చేసి జ‌గ‌న్ వారికి చీక‌ట్లే మిగిల్చాడు. దీంతో వీరంతా క‌న్నీటిప‌ర్యంతం అవుతున్నారు. ఒక‌వేళ సంక్షోభం తీవ్రం అయితే ఆర్థికంగా  దివాళా తీసిన తామంతా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోక త‌ప్ప‌ద‌ని అంటున్నారు కొంద‌రు చిన్న‌, మ‌ధ్య త‌ర‌హాల ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన యాజ‌మాన్య ప్ర‌తినిధులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp