పిల్లలను సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. పిల్లలు పెరిగి పెదై చెడుమార్గంలో వెళ్లారు అంటే ఇక తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే వాళ్ళు అలా అయ్యారు అన్నది తెలుస్తుంది. అందుకే ఎప్పుడూ తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట కనిపెట్టుకుని ఉండాలని పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా అన్నది గమనిస్తూనే ఉండాలి అంటూ సూచిస్తుంటారు నిపుణులు. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగునా అని చెబుతూ ఉంటారు. చిన్నప్పుడే సత్ప్రవర్తన లేక పోతే ఇక పెద్దయిన తర్వాత ఎన్నో నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది అని అంటూ ఉంటారు నిపుణులు.



 అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలను సత్ప్రవర్తన వైపు నడిపించేందుకు కీలక పాత్ర వహించాలని సూచిస్తూ ఉంటారు. అంతేకాదు పిల్లల చుట్టూ మంచి వాతావరణం ఉండే విధంగా చూడాలని చెబుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పిల్లలు కొన్ని కొన్ని సార్లు తప్పులు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నేటి రోజుల్లో పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు ఎంతలా కంట కనిపెట్టిన కూడా ఏదో ఒక విధంగా చెడు దారిలో నడుస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఒకవేళ పిల్లలు తప్పు చేశారు అంటే ఇక నుండి తల్లిదండ్రులకు శిక్ష వేయబోతున్నారు.



అయితే ఇది మన దేశంలో కాదు చైనాలో. ఇటీవల చైనా ప్రభుత్వం మరో షాకింగ్ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. పిల్లలు తప్పు చేస్తే ఇక నుంచి తల్లిదండ్రులకు శిక్ష విధిస్తాము అంటూ ప్రకటన చేసింది. చైనా ప్రభుత్వం కొత్త చట్టం ప్రకారం పిల్లలు తప్పు చేస్తే ఇక నుంచి తల్లిదండ్రులకు శిక్ష వేయాలి అనుకుంటున్నారట. పిల్లల్లో ఏవైనా మార్పులు చోటు చేసుకున్న.. ఇక పిల్లల్లో చెడు ప్రవర్తన అలవాటు అయినా కూడా వారికి వెంటనే ఫ్యామిలీ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ అందించాలి అంటూ చైనా ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే ఈ కొత్త చట్టానికి సంబంధించి ప్రస్తుతం రివ్యూ జరుగుతూ ఉండటం గమనార్హం. ఏదేమైనా ఈ కొత్త చట్టం మాత్రం సంచలనంగా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: