గ‌తం బాగుంటుంది.. లేదా బాగున్న గ‌తాన్నే ఎంపిక చేసిన స్మ‌రించుకోవ‌డం ఇంకా బాగుంటుంది. రాజ‌కీయాల్లో గ‌తం బాగుంటుంది. కొంద‌రు నాయ‌కుల తీరు, వారి న‌డ‌వ‌డి అన్న‌వి ఒక‌టికి రెండు సార్లు ప్ర‌తిరోజూ వ‌ద్ద‌న్నా గుర్తుకువ‌స్తుంటాయి. అలా అయినా వారిని ఓ అంచనా వేయొచ్చు కూడా!

 
సుదీర్ఘ అనుభ‌వం ఉన్న నేత చంద్ర‌బాబు నాయుడు. ఉమ్మ‌డి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ల పాటు నిర్విరామంగా పాలించిన నేత. విభ‌జ‌న ఆంధ్రాను ఐదేళ్ల పాటు పాలించిన నేత‌. ఎంతటి క‌ష్టం వ‌చ్చినా చ‌లించ‌ని నేత. ఓ విధంగా జ‌గ‌న్ క‌న్నా చంద్ర‌బాబే కొన్ని విష‌యా ల్లో స‌మ‌ర్థుడు అని ఇప్ప‌టికే నిరూపించుకున్నారు కూడా! ఈ విష‌యం వైసీపీ ఒప్పుకోకున్నా పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లోనూ, పాల‌నను పరుగులు పెట్టించ‌డంలోనూ చంద్ర‌బాబు ఎప్పుడో జ‌గ‌న్ ను దాటిపోయారు. కానీ జ‌గ‌న్ మాత్రం ఇంకా నేర్చుకున్న ద‌శలోనే ఉన్నారు. పాల‌న‌లో త‌ప్పిదాలు స‌రిదిద్ద‌లేక అవ‌స్థ ప‌డుతున్నారు. పాల‌న‌కు అర్థం సంక్షేమ‌మే అని కొత్త నిర్వ‌చ‌నం చెప్పి, అప్ప‌టిదాకా చేప‌ట్టిన అభివృద్ధి ని కూడా అట‌కెక్కించారు. ఈ త‌రుణంలో ఒక్క‌సారి పాత రోజుల‌ను జ‌గ‌న్ త‌లుచుకుని తీరాలి. అదేవిధంగా చంద్ర‌బాబు కూడా ఆ రోజు జ‌గ‌న్ విష‌య‌మై న‌డుచుకున్న తీరుపై మ‌రో మారు అవ‌లోక‌నం చేసుకోవాలి.



త‌మ‌ది ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం అని చెబుతాడు జ‌గ‌న్. అందుకు అనుగుణంగానే త‌మ కార్యాచ‌ర‌ణ ఉంటుంది అని కూడా చెప్పాడు జ‌గ‌న్. అందుకే తాను ప్ర‌జ‌ల మ‌న‌సులకు అనుగుణంగానే ప‌నిచేసేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని, ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ప‌ట్టించుకోన ని చెబుతున్నాడు జ‌గ‌న్. నిజంగానే వైసీపీది ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వ‌మేనా! ఆ రోజు జ‌గ‌న్ టీడీపీ నుంచి ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. వాటిని మ‌న‌సులో ఉంచుకుని తాను ఈ రోజు ఈ విధంగా ప్ర‌వ‌ర్తించండం ద్వారా సాధించిందేంటి? వాస్త‌వానికి  నిర‌స‌న‌లు అణిచి వేసిన ప్ర‌తిసారీ గెలిచింది బాబూనే! అవును! అప్ప‌ట్లో టీడీపీ కూడా జ‌గ‌న్ పై ఇలానే ప్ర‌వ‌ర్తించి ఆయ‌న‌ను హీరో చేసింది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన చోట ప‌సుపు నీళ్లు జ‌ల్లి, ఆయ‌న‌ను అవ‌మానించి ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది. ఇప్పుడు కూడా అలానే వైసీపీ స‌ర్కారు వ‌ర్గాలు టీడీపీపై ప్ర‌గ, ప్ర‌తికారంతో ర‌గిలిపోతున్నాయి. ఆయ‌న త‌ప్పు చేస్తే నేనూ త‌ప్పు చేస్తా అని చెప్ప‌డమే త‌ప్పు.

మరింత సమాచారం తెలుసుకోండి: