ఏపీ సీఎం, వైసీపీ అధినేతగా జగన్ మరోసారి తన పార్టీని గెలిపించేందుకు ఇప్ప‌టి నుంచే అనేక ర‌కాల వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఈ సారి కూడా గెలిస్తే ప‌దేళ్ల పాటు తానే సీఎంగా ఉంటాన‌ని.. అప్పుడు పార్టీ ప‌రంగా మ‌రింత స్ట్రాంగ్ అవ్వ‌చ్చ‌న్న‌దే జ‌గ‌న్ టార్గెట్‌. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌లు మ‌రో రెండేళ్లు ఉన్నాయి. ఈ రెండేళ్ల లో జ‌గ‌న్ ప్లాన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. జ‌గ‌న్ క్షేత్ర స్థాయిలో పార్టీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌ల‌ను అస్స‌లు ప‌ట్టించు కోవ‌డం లేదు. కేవ‌లం సంక్షేమ అన్న సూత్రాన్ని బేస్ చేసుకుని ఆయ‌న జ‌నాల్లోకి విస్తృతంగా వెళ్లాల‌ని అనుకుంటున్నారు.

అయితే ఏపీ లో జ‌గ‌న్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఆయ‌న్ను ఓడించేందుకు చంద్ర‌బాబు , ప‌వ‌న్ చేతులు క‌లుపు తారు అన్న ప్ర‌చారం జోరుగా న‌డుస్తోంది. జ‌గ‌న్ కూడా వీరిద్ద‌రు క‌లిస్తే ఎలా త‌ట్టుకుని గెల‌వాల‌ని అన్న దానిపై ఇప్ప‌టి నుంచే త‌న ప్లాన్ల‌లో తాను ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాపుల‌కు సీట్లు ఇవ్వాల‌ని ఆయ‌న నిర్ణ‌యం తీసుకుంటున్నారు.

పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తి సీటును బ‌లిజ ల‌కే ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ట‌. అదే జ‌రిగితే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణా క‌ర్ రెడ్డికి షాక్ త‌ప్ప‌దు. అలాగే అనంత‌పురం జిల్లా కేంద్ర‌మైన అనంత పురం అర్బ‌న్ సీటు సైతం బ‌లిజ‌ల‌కే ఇచ్చే వ్యూహం జ‌గ‌న్ ప‌న్ను తున్నార‌ట‌. ఈ నియోజకవర్గంలోనూ కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నా... రెండు దశాబ్దాలుగా ఇక్కడ రెడ్డి, కమ్మ నేత‌లే ఎమ్మెల్యే లుగా ఉంటున్నారు.

2004 నుంచి చూస్తే ఇక్క‌డ రెడ్లు , మ‌ధ్య‌లో  ఓ సారి 2014లో క‌మ్మ నేత ప్ర‌భాక‌ర్ చౌద‌రి గెలిచారు. అయితే ఈ సారి జ‌గ‌న్ ఇక్క‌డ సీటును కాపు ల‌కే ఇస్తార‌ని.. జ‌న‌సేన + టీడీపీ క‌ల‌సినా కాపుల ఓట్లు చీల్చ‌డం ద్వారా ఈ సీటు వైసీపీ ఖాతాలో వేసుకోవ‌చ్చ‌న్న‌దే ఆయ‌న ప్లాన్ అట‌. అదే జ‌రిగితే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అనంత వెంక‌ట్రామిరెడ్డికి పెద్ద షాక్ త‌ప్ప‌ద‌నే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: