నేడు తెలంగాణాలో ఉపఎన్నికల  ఫలితాలు వెలువడుతున్నాయి. దాదాపుగా అధికార పార్టీ మరియు బీజేపీ కూడా అంచున అంటే కేవలం 3-4 వేల మెజారిటీ మధ్య ఉన్నాయి. హుజురాబాద్ సీటు కూడా బీజేపీ పరం అవుతుందనే ఫలితాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇన్నేళ్ల చరిత్రలో కేసీఆర్ కు ఇది రెండో భారీ ఓటమి. భారీ అంటే మెజారిటీ విషయంలో కాదు కానీ తన పార్టీ నేతపై తెరాస ఓడిపోవడం మాత్రం చిన్న విషయం కాదు. అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, కేసీఆర్ దానిని కనిపెట్టకపోతే రాబోయే ఎన్నికలలో ఫలితాలు ఆశాజనంగా ఉండవని ఈపాటికే అర్ధం అయిఉంటుంది. తాను చేస్తున్న పాలనలో తప్పులు దిద్దుకొని ముందుకు వెళ్లకపోతే కేసీఆర్ రేపటి రోజున అధికారం కూడా కోల్పోయే పరిస్థితి మాత్రం ఉందనేది ఈ పరిస్థితిని బట్టి చెప్పవచ్చు.

రెండంటే రెండే సీట్లు ఎవరో కొట్టుకుపోతే ఇంత బాధపడాలా అని వేరే విధంగా ఆలోచిస్తే మటుకు నష్టపోక తప్పదు. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కదా, ఇప్పటి వరకు ఇవ్వని పధకాలు అన్ని, సరిగ్గా ఎన్నికల ముందు ప్రజలకు ఇస్తే వాళ్ళే ఉబ్బి తబ్బిబ్బై ఓట్లు కురిపించేస్తారు అనే ధోరణిలోనే కేసీఆర్ ఉంటె మటుకు, ఓటరు కూడా చక్కగా ఆ పధకాలు అన్ని తీసుకోని, ఓటుకు ఇంతని ఇస్తే దానిని కూడా చక్కగా నవ్వుతు తీసుకోని వాళ్లకు అనుకూలంగా ఉన్న పార్టీకి ఓటువేసి కేసీఆర్ చేతిలో చిప్ప పెడతారు అనేది మాత్రం ఖచ్చితం. దీనిని అర్ధం చేసుకుంటే తెరాస నిలబడుతుంది, లేదంటే ఒక్కసారి ఓటమి పాలైతే అర్ధం అవుతుంది. ఇన్నేళ్లు సీటు పట్టుకుని కూర్చొని రేపటి రోజున అది కాస్తా ఓడిపోతే, ఒక్కసారిగా ఏసీబీ లాంటివాళ్లు మీదపడితే అర్ధం అవుతుంది పదవి ఎంత ముఖ్యమో అని.  

అందుకోసమైయినా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉద్యమం రోజులు ప్రజలకు కాదు, నేతలు గుర్తు చేసుకొని, ప్రచారం నుండి పధకాలు వరకు కనీసం ఈ ఎన్నికల వరకు చేస్తే, కాస్త అంచులలో గెలవచ్చు. అంటే కనీసం సరాసరి మెజారిటీ సీట్లు రావచ్చు. అప్పుడు మరి కాస్త ప్రజాసేవ చేస్తే ఈసారి భారీగా గెలుపు ఆశించవచ్చు. లేదు ఊరికే ఎన్నికల సమయంలో ఏదైనా మభ్యపెట్టేట్టుగా మాట్లాడి, ఇష్టానికి చేసుకుంటూ పోతే పదవికి గండం తప్పదు. శత్రుల సంఖ్య భారీగా ఉన్నదని ఇప్పటికే అర్ధం అయిఉండాలి. రెండు కాదు, నిన్నొచ్చి రెండు కోళ్ల గొట్టారు, రేపటికి రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుపోవడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. తస్మాత్ జాగర్త కేసీఆర్!

మరింత సమాచారం తెలుసుకోండి: