తెలుగు సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి తీసుకొచ్చిన వైబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సమయంలో యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్, మీమ్స్ ఎక్కడ చూసినా వీళ్లే కనిపించారు. వారి కెమిస్ట్రీ, న్యాచురల్ ఫన్, మైండ్‌వాయిస్ స్టైల్ డైలాగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రేజ్‌ కారణంగానే మాధురి బిగ్ బాస్ హౌస్‌లోకి కూడా అడుగు పెట్టింది. బిగ్ బాస్ ద్వారా ఓ పెద్ద గుర్తింపు సంపాదించుకుని, సిల్వర్ స్క్రీన్‌కు చేరాలనే ఆలోచన ఆమెకు అప్పట్నుంచే ఉంది. ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంది. ఈ నెల 21న రిలీజ్‌ కానున్న ‘ప్రేమంటే’ సినిమాలో దువ్వాడ జంటను అతిథి పాత్రల్లో చూడ‌బోతున్నాం అని టాక్ ?  ఈ ఇద్దరూ స్క్రీన్‌పై ఎక్కువసేపు కనిపించకపోయినా, వారి ఎంట్రీ మాత్రం సర్‌ప్రైజింగ్‌గా, ఫన్‌గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో వీరి పాత్రల కోసం ప్రత్యేకంగా ఓ హాస్యభరితమైన సీన్ డిజైన్ చేసినట్లు సమాచారం.


ఇటీవలే విడుదలైన మరో సినిమాలో కూడా వీళ్లిద్దరికీ ఇలాంటి చిన్న ప్రత్యేక పాత్ర ఆఫర్ వచ్చింది. కానీ ఆ సమయంలో ఏదో కారణం చేత ఇద్దరూ అంగీకరించలేదు. ఈసారి మాత్రం ఓకే చెప్పారు. ముఖ్యంగా మాధురికి ఇది మంచి ఛాన్స్‌. బిగ్ బాస్ తర్వాత ఆమె ఫేమ్ ఇంకా కొనసాగుతుండగానే ఈ సినిమాతో పెద్ద ఎత్తున సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె కెరీర్‌కి ఇది మంచి స్టార్ట్ అవుతుందనే నమ్మకం కూడా అభిమానుల్లో ఉంది. ఇక ప్రియదర్శి - ఆనంది ప్రధాన జంటగా నటించిన ఈ సినిమాలో సుమ కనకాల కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి అతిథి పాత్రలతో పాటు, సినిమాలో మరికొన్ని సర్‌ప్రైజింగ్ క్యామియోలు కూడా ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా దువ్వాడ జంట అభిమానులకు ఇది ఖచ్చితంగా అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్ కానుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: