దేశ రాజకీయ వ్యవస్థ ను అర్థం చేసుకోవడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట.. ఈయన పొలిటికల్ అనలిస్ట్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఈయన బీహార్ ఎలక్షన్స్ లో  జన్ సూరజ్ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.. అయితే ఓటమి కి గల కారణాలేంటో ప్రశాంత్ కిషోర్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటపెట్టారు. అంతే కాకుండా ఎన్డీఏ కూటమి గెలుపు కు కారణాలేంటో కూడా ఆయన  చెప్పుకొచ్చారు. మరి ప్రశాంత్ కిషోర్ ఏమన్నారో ఆ వివరాలు చూద్దాం.. ప్రశాంత్ కిషోర్ ప్రెస్ మీట్ లోకి మాట్లాడుతూ.. మేము ప్రభుత్వాన్ని మార్చడం లో విఫలమయ్యాం.. మేము చేయాలనుకుంటున్న పనుల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం లో కూడా విఫలమయ్యామని చెప్పుకొచ్చారు. 

మేము ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామని అన్నారు.. అయితే బీహార్ లో 240 కూడా అసెంబ్లీ  స్థానాలు ఉంటే 238 స్థానాల్లో పోటీ చేసింది. అయితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని కొంత మంది అంటున్నారు.అది అసాధ్యం అంటూ చెప్పుకొచ్చారు.. ఇక జెడియూ కు సవాల్ కూడా విసిరారు. జేడీయు నేతృత్వం లో అధికారం లోకి వచ్చినటు వంటి సర్కార్ 1.5 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి రెండు లక్షలు  అందిస్తామని చెప్పి కోట్లాదిమంది మహిళలను నమ్మించింది.

 దీనివల్లే ఎన్డీఏ కు ఇంత మెజారిటీ వచ్చిందని తెలియజేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బీహార్ లో మొదటి సారిగా ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ముందుగానే హామీ ఇచ్చి ఇంత మెజారిటీ తెచ్చుకుందని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ తిరిగి అధికారం లోకి వస్తేనే ఈ పనులు జరుగుతాయని ప్రభుత్వ అధికారులు కూడా ప్రచారం చేశారని అన్నారు. అందువల్లే ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ లో అధికారం లోకి వచ్చిందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకు వచ్చారు ...

మరింత సమాచారం తెలుసుకోండి: