మోషేన్ రాజు తనకు బాగా తెలుసునని.. ప్రసంగించారు. ఆయన చాలా విధేయుడని అన్నారు. ఈ సంద ర్భంగా.. తనకు కూడా వైఎస్ తో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. తను కూడా ఎంతో అభిమానంతో ఉండేవాడినని అన్నారు. చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఒకింత కన్నీటి పర్యంతమయ్యా రు. మొత్తానికి కార్యక్రమంలో ఈయన హైలెట్ గా నిలిచారు. అయితే.. అక్కడకు వచ్చిన సీఎం సహా.. అందరూ.. సదరు ఎమ్మెల్సీ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా వినడం.. ఆయన కన్నీటి పర్యంతం కావడం వంటివాటిని.. చూసి నిశ్చేష్టులయ్యారు.
అసలు ఏం జరిగింది? అనే గుసగుస కూడా వినిపించింది. అయితే.. అప్పటికి ఎవరూ ఏమీ చెప్పలేదు. కానీ, తర్వాత.. పరిణామాలు చూస్తే.. మాత్రం.. సదరు ఎమ్మెల్సీ అనచరులు.. జిల్లాకు చెందిన ఆయన అనుచరులు కొన్ని కీలక విషయాలు చూచాయగా చెప్పారు. మా నాయకుడు చైర్మన్ గిరీపై ఆశలు పెట్టుకున్నారని.. ఆయనకు దక్కుతుందని అనుకున్నారని.. ఆయన కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితులే కనుక.. ఆయనకు ఇస్తారని అనుకున్నారని..చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. తనకు ఇచ్చి ఉంటే.. టీడీపీని ఒక ఆట ఆడుకుంటానని ఆయన తరచు చెప్పేవారని.. వెల్లడించారు. అయితే.. ఎస్సీ వర్గానికి కేటాయించినా.. తనకు దక్కకపోవడం ఒకింత బాధగా ఉందని.. అందుకే ఆయన కన్నీటి పర్యంతం అయి ఉంటారని.. చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీలో కొందరు .. ఇలాంటి ఆశలు పెట్టుకోవడం.. అవి నెరవేరకపోవడం.. కామనేనని ఫక్కున నవ్వేశారట!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి