పూలమ్మిన చోట కట్టెలు అమ్మినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దక్షిణ తెలంగాణ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. సీట్లు కూడా అనేకం గెలుచుకుంది మంచి క్యాడర్ ఉన్నటువంటి  ఏరియా కానీ సీన్ రివర్స్ అయ్యింది. పెద్ద పెద్ద నాయకులు ఉన్న పరిస్థితులు మారడం లేదు. స్థానిక సంస్థల్లో కనీసం పోటీ చేయ లేక చేతులెత్తేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటివరకు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగులేదు అనే పేరు మాత్రమే ఉన్నది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ హస్తం పార్టీకి మంచి పట్టున్న జిల్లాలు. ఇప్పటివరకు ఈ రెండు జిల్లాల నుంచి ఎక్కువ స్థానాలు కూడా దక్కించుకుంది. నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మహబూబ్నగర్ జిల్లాకు వస్తే టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్, ఏఐసిసి సెక్రెటరీగా చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్రెడ్డి ఉన్నారు.

కాంగ్రెస్లో బలమైన నేతగా పేరు ఉన్నటువంటి లీడర్లు ఈ రెండు జిల్లాలకు సంబంధించిన వారైనా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరడం లేదని గాంధీభవన్లో గుసగుసలాడుతున్నారు. ఇంతటి బడా నేతలు ఉన్న కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది అంటే కారణం ఏంటి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2, నల్గొండ జిల్లాలో 1 ఎన్నిక జరుగుతోంది. ఈ రెండు జిల్లాల్లో కాకుండా మెదక్ ఖమ్మం జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్  పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపింది. వాస్తవంగా చూసుకుంటే గత ఎన్నికల్లో మహబూబాబాద్ రెండు స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. కానీ ఈసారి పోటీ కూడా దిగకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం సాధించారు. ఈసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, జానా రెడ్డి లాంటి సీనియర్లు ఉన్న  ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయడానికి కనీసం ముందుకు రావడం లేదు. అటు మహబూబ్నగర్ లో కూడా సేమ్ సీన్ నడుస్తోంది. గత ఎన్నికల్లో మాజీ మంత్రి డీకే అరుణ ఛాలెంజ్గా తీసుకొని  దామోదర్ రెడ్డి ని గెలిపించారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద లీడర్లు ఉన్న కనీసం పోటీ చేయాలనే ఆలోచన కూడా చేయలేకపోయారు. మొత్తానికి ఒకప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోటీ చేయకపోవడంపై ప్రజల్లో పలు మాటలు వినిపిస్తున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: