మండలి పోరు చాలా రసవత్తరంగా  కనిపిస్తోంది. అధికార తెరాస పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నా, క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందేమో అని భయంతో ఉంది. అటు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కరీంనగర్ సీటుపై   గురి పెట్టారని వ్యాస నేతల్లో ఆందోళన నెలకొంది. ఇలా పైకి గంభీరంగా చెప్పుకుంటున్నా లోపల మాత్రం ఏదో తెలియని బాధ తెరాస నేతలను వెంటాడుతుంది అని చెప్పవచ్చు. కరీంనగర్లో 28 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భానుప్రసాద్ రావు మరియు ఎల్.రమణతో పాటుగా పార్టీకి రాజీనామా చేసినటువంటి రవీందర్ సింగ్, మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

 జిల్లాలో మొత్తం 1324 మంది ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ చెందినవారు 996 మంది. అయినప్పటికీ టిఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుంది. అధికారపార్టీకి ఈటల రాజేందర్ రూపంలో వ్యతిరేక వర్గం పెరిగిపోయింది. సర్దార్ రవీందర్ సింగ్ మునుముందు ఉంచినట్లు బహిరంగ ప్రచారమే. దీంతో స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో కరీంనగర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రధానంగా దృష్టి సారించారు. సర్దారును ఎలాగైనా గెలిపించుకునేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తూ వస్తున్నారు. క్యాంపులోకి వెళ్ళిన ఓటర్లను వదిలేసి, వారి కుటుంబాలను టార్గెట్ చేసే ప్లాన్ అమలు చేస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా పాత రిజర్వేషన్ల అమలులో ఉండటంతో మళ్లీ వారినే పోటీకి దింపుతామని, వారిని గెలిపించుకునే బాధ్యత తనదేనని, ఖర్చు కూడా భరిస్తామని ఇప్పుడు మండలి ఎన్నికల్లో మాత్రం తాము చెప్పినట్లు ఓటు వేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కుటుంబాలను కలిసి ఈటల రాజేందర్ హామీలు ఇస్తున్నారు.

 అంతే కాకుండా మొదటి హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఎంపీటీసీలు, జడ్పిటిసి సభ్యులు, సర్పంచులు మళ్లీ ఈటలకు  టచ్ లోకి వచ్చారని తీవ్రంగా ప్రచారం జరుగుతున్నది, తాము అధికార పార్టీ బెదిరింపులకు భయపడి, కానీ లోపాయికారిగా మీకు చేశామంటూ స్థానిక ప్రజాప్రతినిధులు రాజేందర్ కు మధ్యవర్తుల ద్వారా సమాచారం వెళ్ళింది అంటూ  టాక్. దీన్ని బేస్ చేసుకుని ఈటల రాజేందర్ స్థానిక సంస్థల్లో ఓట్లు కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: