పాకిస్తాన్లో ప్రభుత్వానికి రోజురోజుకు ప్రజల నుంచి తిరుగుబాటు ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ కావడం లేదు.. ప్రజా ప్రయోజనాలను కూడా వదిలేసి ఉగ్రవాదులను పెంచి పోషించడమే లక్ష్యంగా పెట్టుకుంది పాకిస్తాన్.. అయితే ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకు పోతున్నా చైనాకు కట్టుబానిస గా ఉన్న పాకిస్తాన్  బెలూచిస్తాన్, గిల్గిట్ బాల్టిస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా చైనాకు అప్పజెప్పింది. అయితే ఇలా అప్ప జెప్పినప్పుడికి కనీసం తమకు ఉద్యోగాలు అయినా వస్తాయని పాకిస్థాన్ ప్రజలు భావించారు.



 చైనా మాత్రం ఏకంగా తమ దేశం నుంచి పౌరులను పాకిస్థాన్కు రప్పించి మరీ కేవలం వారితో మాత్రమే పనులు చేయించుకుంటూ ఉంది   స్థానికులకు ఎవరికి కూడా కనీస ఉపాధి కల్పించడం లేదు. ఇలా ఏకంగా పాకిస్తాన్ సంపదను మొత్తం చైనా దోచుకు పోతుంది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఏకంగా చైనా ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వలేక బానిస లాగా చూసీచూడనట్టుగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఇక అటు ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.


 అయితే చైనా తీరు కారణం గా లక్షలాది మంది ప్రజలు ఉపాధి లేక నిరుద్యోగులుగా మారి చివరికి నిరాశ్రయులుగా మారి పోయారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు లో ఉన్నటు వంటి ఎంతో మంది ప్రజలు సైన్యాన్ని పోలీసులను ప్రభుత్వాన్ని సైతం పట్టించు కోకుండా తిరుగు బాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని చైనాకు అప్పజెప్పడానికి వీలు లేదు అంటూ గ్వాదర్ పోర్ట్ ప్రజలందరూ ఉద్యమం బాట పట్టారు. కనీసం మా ప్రయోజనాల గురించి ఆలోచించని ప్రభుత్వం ఇక మాకెందుకు అంటూ ఏకంగా ప్రజలందరూ నిలదీస్తూ రోడ్డు మీదే బైఠాయించి ఉద్యమాలు చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వం తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: