భూమి మీద మనిషి మనుగడ కోసం గాలి నీరు లాంటి పంచభూతాలు ఉన్నాయి. మరి ఇతర గ్రహాలపై మనిషి మనుగడ సాధ్యమేనా అన్న దానిపై ఎన్నో రోజుల నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇతర గ్రహాలపై నీటి జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇలా శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు అటు ఇతర గ్రహాలపై నీటి జాడ మాత్రం ఎక్కడ బయట పడలేదు. ఈ క్రమంలోనే ఇటీవలే అంగారక గ్రహంపై శాస్త్రవేత్తలు నీటి అన్వేషణలో మరో ముందడుగు వేశారు. ఇన్ని రోజుల వరకు నీటి కోసం ధ్రువ ప్రాంతాల్లో మాత్రమే వెతికారు.


 కానీ అంగారక గ్రహం పై గర్భంలో నీరు ఉండవచ్చు అని భావించి ఆ దిశగా పరిశోధనలు మొదలుపెట్టారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే ఒక అనూహ్యమైన  విషయం బయటపడింది. వాలెస్ మెరైనరీస్ అనే ప్రాంతంలో ఒక భారీ రిజర్వాయర్ ను గుర్తించారు శాస్త్రవేత్తలు. అయితే లోయలతో కూడిన ఈ రిజర్వాయర్ లాంటి నిర్మాణం ఉపరితలానికి మీటర్ లోతులో ఉంది అన్న విషయాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు ఇక ఈ రిజర్వాయర్ ఏకంగా 45 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందట..


 అంటే దాదాపుగా అటు హర్యానా రాష్ట్రం అంత పెద్దగా ఇక ఈ రిజర్వాయర్ ఉంది అని శాస్త్రవేత్తలు తెలిపారు.. ఈ క్రమంలోనే గతంలో ఇక ఈ ప్రాంతంలో నీళ్లు కూడా ఉండేవి అని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే మార్ష్ పై నీటి అన్వేషణ కోసం రష్యా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్ ను అంగారక గర్భంలోకి  పంపించడం గమనార్హం. దీనిలో ఉండే ఫ్రెండ్ టెలిస్కోప్ గర్భంలోని ఈ రిజర్వాయర్ ను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఉన్న మట్టిలోని రసాయన మూలికలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేసిన తర్వాత భారీగా హైడ్రోజన్ ఉన్నట్లుగా గుర్తించారు. గతం లో నీటి నిల్వల వలనే ఈ హైడ్రోజన్ భారీగా ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: