వినటానికే కాస్త ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే తనను చంపటానికి కొందరు రెక్కీ నిర్వహించారని స్వయంగా వంగవీటి రాధాకృష్ణ (రాధా)నే చెప్పారు కాబట్టి నమ్మాల్సిందే. ఒకసారేమో తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని చెప్పారు. వెంటనే తనను ఏదో చేద్దామనుకుని రెక్కీ నిర్వహించారు అంటు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తాను ఎవరికీ భయపడేది లేదని, దేనికైనా తెగించున్నట్లు రాధా సవాలు విసిరారు.
రాదా చెప్పిన మాటలు, చేసిన సవాలు గాలిలో బాణం వేసినట్లుంది. ఎందుకంటే తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని కనుక్కున్న రాధా ఆపని ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? అనేది కనుక్కోలేరా ? మరి ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు ? హోలు మొత్తంమీద డౌటనుమానం ఏమిటంటే అసలు రాధాను చంపాల్సిన అవసరం ఎవరికుంది ? ఎందుకంటే రాధా ఏమీ పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కాదు. రాధాతో ఎవరికీ తగాదాలున్నట్లు కూడా ఎప్పుడూ బయటపడలేదు.
పోనీ రాజకీయంగా అడ్డు తొలగించుకుందామని చూశారా అంటే అంత సీన్ లేదు. అప్పుడెప్పుడో అంటే దాదాపు 20 ఏళ్ళక్రితం ఒకసారి ఎంఎల్ఏగా గెలిచారంతే. కాంగ్రెస్ నుండి ప్రజారాజ్యంపార్టీలోకి అందులోనుండి వైసీపీలోకి మారారు. మళ్ళీ అందులోనుండి టీడీపీలోకి జంప్ చేశారు. మళ్ళీ టీడీపీలో నుండి బయటకు వచ్చేస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారుకానీ అక్కడ కూడా యాక్టివ్ గా లేరు.
ఒకవైపు ఇలాంటి ప్రచారం జరుగుతుండగానే తన తండ్రి, రంగా వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతు తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని చెప్పటం సంచలనంగా మారింది. తొందరలోనే రెక్కీ నిర్వహించిందెవరో కూడా తెలుస్తుందన్నారు. అంటే ఇప్పటికే ఆ విషయాన్ని కనుక్కునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా రాధా ఎవరికీ ప్రత్యర్ధి అయితే కానపుడు ఇంకెందుకు రెక్కీ నిర్వహిస్తారు ? ఎవరితో అయినా ఆస్తి తగాదాలున్నాయోమో తెలీదు. ఆ విషయాన్ని రాధాయే చెప్పాలి. ఏదేమైనా ఇపుడు రాధా చేసిన రెక్కీ ప్రకటనే సంచలనంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి