ముఖ్యంగా మహిళలను బానిసలుగా మార్చుకుని కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారు. మహిళలు కనీసం కాలు బయట పెట్టడానికి కూడా వీలు లేదు అన్న విధంగా ప్రస్తుతం తాలిబన్ల ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పాలి. అయితే మహిళలు పురుషులతో కలిసి చదువుకోడానికి వీలు లేదని.. అంతేకాకుండా ఉద్యోగాల్లో కొనసాగడానికి వీల్లేదని ఇప్పటికే ఎన్నో నిబంధనలు తెరమీదకు తీసుకువచ్చారు తాలిబన్లు. ఇక ఇప్పుడు మరో సారి మహిళలపై చేశారు మరో హుకుం చేశారు. మహిళలు కనీసం ఒంటరిగా దూరప్రయాణాలు చేయడానికి కూడా వీలు లేదు అంటూ ఆదేశాలు జారీ చేశారు దూరప్రాంతాలకు వెళ్లే మహిళలు తప్పనిసరిగా తమతో పాటు ఒక పురుషుడిని తీసుకెళ్లాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.
పురుషుడు లేకుండా దూర ప్రయాణాలకు వచ్చిన మహిళకు రవాణా సౌకర్యం కల్పించ కూడదు అంటూ తాలిబన్లతో ప్రభుత్వం ఇటీవలే తాలిబన్ల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. దాదాపు నలభై ఐదు మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే ప్రతి మహిళ కూడా తమతో ఒక పురుషుడిని తీసుకు వెళ్లాల్సిందే అంటూ తాలిబన్లు తెలిపారు. అటు తాలిబన్లు తెరమీదకు తెచ్చిన ఈ కొత్త నిబంధనపై మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. అయితే ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలపై ఎన్నో ఆంక్షలు అమలులో ఉండగా. ఇక ఇప్పుడు తాజా ప్రకటనతో తాలిబన్ల అసలు రంగు మరోసారి బయటపడింది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి