ఇటీవలి కాలంలో పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న సామాన్యుడిపై భారం పెరిగి పోయింది. కరోనా వైరస్ కారణంగా సరైన ఉపాధి దొరక్క రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న సామాన్యుడికి పెరుగుతున్న పెట్రోల్ ధరలు తరచూ షాక్ ఇస్తూ ఉన్నాయి. అయితే అటు ధనవంతుల పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పెట్రోల్ ధరలు పెరిగినా తగ్గినా కూడా వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు రావడం లేదు. కానీ సామాన్యుడి జీవన శైలిలో మార్పులు వస్తున్నాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో ఎక్కడికైనా వెళ్లాలంటే వాహనం తీయడానికి కూడా భయపడి పోతున్నాడు సామాన్యుడు.



అంతలా సామాన్యుల జీవితాలను పెట్రోల్ ధర పెరుగుదల ప్రభావం చూపింది అని చెప్పాలి. పెట్రోల్ ధరలను తగ్గించండి మహాప్రభో అంటూసామాన్య ప్రజలు ఎంత మొత్తుకున్నా అటు ప్రభుత్వాలకు ఏమాత్రం పట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంపై.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు తప్ప.. ఎక్కడా పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్యుడిపై భారం తగ్గించాలని అన్న ఆలోచన మాత్రం చేయడంలేదు. ఇలాంటి సమయంలో సామాన్యుల అందరికీ ఊరట కలిగించే విధంగా ఇటీవలే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పై 25 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు.



 ఇప్పటి వరకూ చాలా మటుకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు సామాన్యులతో పాటు సంపన్నులకు కూడా అదేరీతిలో అందుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల ద్వారా సామాన్యుల కంటే సంపన్నులే ఎక్కువగా లబ్ధి పొందుతారు అని చెప్పాలి. కానీ ఇక్కడ హేమంత్ సోరేన్ మాత్రం కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే సబ్సిడీ ఇస్తాము అంటూ ప్రకటించడం మాత్రం మరింత హర్షించదగ్గ విషయం అని అంటున్నారు విశ్లేషకులు. అంటేసీఎం తీసుకున్న నిర్ణయం కారణంగా కేవలం పేదలకు మాత్రమే లబ్ధి చేకూరుతోంది. ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సబ్సిడీ అందుబాటులో ఉండదు. ఇలా అసలైన నిరుపేదలకు హేమంత్ సొరేన్ తీసుకున్న నిర్ణయం కారణంగా మేలు జరగబోతుంది. ఇక ఇలాంటి నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారగా.. జార్ఖండ్ ముఖ్యమంత్రి  హేమంత్ సొరేన్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: