రాష్ట్రంలో మరో 15 రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కి చేరే ప్రమాదముందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి మధ్యలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు  రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఓమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగిపోయింది. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఓమిక్రాన్ కేసులు ఉన్నట్లు వైద్య అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే డెల్టా వేరియంట్ కేసులు కూడా ఇంకా తగ్గిపోయేది. ఇప్పటి కోవిడ్ కేసుల్లో సాధారణ జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు.

 మన దేశంలో ముఖ్యంగా అనేక రాష్ట్రాల్లో సుమారు 15కు పైగా రాష్ట్రాల్లో కేసులు పెరగడం మొదలైందని ఆయన అన్నారు. దీన్ని మనం థర్డ్ వేవ్ కి ప్రారంభంగా చెప్పుకోవచ్చని అన్నారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జనవరి ఫస్ట్ నుండి కరోనా కేసుల పెరుగుదలను మనం చూస్తున్నాం. మొత్తం మీద మన దేశంలో,మన రాష్ట్రంలో  రెండు నుంచి ఆరు రెట్లు కరోనా కేసులు పెరిగాయి. అలాగే మన రాష్ట్రంలో గత ఐదు రోజుల నుంచి సుమారు ఐదు రెట్లకు పైగా కేసులు పెరుగుదలను మనం చూసామని ఆయన అన్నారు. కోవిడ్ బాధితులు ఆందోళన చెందవద్దని, పాజిటివ్ రాగానే హాస్పిటల్ కు పరుగులు పెట్టవద్దని వైద్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఆక్సిజన్ సాచురేషన్ 93  కంటే తక్కువగా ఉంటేనే వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అనవసరంగా కోవిడ్ బాధితులను అడ్మిట్ చేసుకుని ఖరీదైన మందులు ఇవ్వద్దని చెబుతున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్.

రాజకీయ పార్టీలు రాబోయే కొన్ని రోజుల పాటు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని రాజకీయ నాయకులు దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల కోవిడ్ టెస్ట్ కిట్స్, కోటి హోం ఐసోలేషన్ కిట్స్  సిద్ధం చేశారు.వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు హెల్త్ డైరెక్టర్. అలాగే వచ్చే నాలుగు వారాల పాటు వైద్య సిబ్బందికి ఎవరికి సెలవులు లేవని చెప్పారు. రాష్ట్రంలో జనవరి 26 నాటికి రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై 15 నుంచి 18 ఏళ్ల మధ్య పిల్లలకు విద్యాసంస్థల లోనే కోవిడ్ టీకాలను ఇవ్వనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: