అయితే కరోనా వైరస్ వచ్చిన సమయంలో ఇక ఉద్యోగులందరినీ కూడా వర్క్ ఫ్రం హోం చేస్తూ టెక్ కంపెనీలు అని నిర్ణయం తీసుకున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలలో సైతం ఉద్యోగులు ఇలా వర్క్ ఫ్రం హోం చేసే విధంగా కొన్నాళ్లపాటు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక ఇప్పుడు మరో సారి దేశం లో వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గర్భిణీలు, దివ్యంగా ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా మినహాయింపు ఇస్తున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి వారు ఇంటి నుంచే పని చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
అంతేకాకుండా కంటోన్మెంట్ జోన్ లో నివాసముంటున్న అధికారులు ఇతర సిబ్బందికి కూడా ఈ మినహాయింపు ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కార్యదర్శి కంటే కిందిస్థాయి ఉద్యోగులందరూ కూడా కేవలం 50 శాతం మాత్రమే కార్యాలయాలకు రావాలి అంటూ తెలిపారు. మిగతా 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గి కంటోన్మెంట్ జోన్గా ఆయా ప్రాంతాలను తొలగించెంతవరకు కూడా ఇలాంటి నిబంధనలు అందరూ పాటించాలని సూచించారు.. సమావేశాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించాలని సూచించారు. ఇక ఈ రూల్స్ జనవరి 31 వరకు కూడా అమల్లో ఉంటాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి