సంక్రాంతి వేడుక‌ల్లో గోదావ‌రి జిల్లాల‌తో పాటు మిగ‌తా జిల్లాల్లోనూ ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్ని త‌మ ప్ర‌జ‌ల‌ను హుషారెత్తిస్తున్నారు. మంత్రి చెల్లుబోయిన వేణు త‌న నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురంలో భారీ ఎత్తున వేడుక‌లు నిర్వ‌హిస్తుంటే, మ‌రోవైపు అంబ‌టి భోగీ మంట‌లు వేసుకుని హాయిగా అక్క‌డున్న వారితో చిందులేయ‌డం ఇవాళ ట్రోల్ పాయింట్ గా నిలిచింది.

సాధార‌ణంగా వివాదాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే అంబ‌టి రాంబాబు ఇవాళ మాత్రం త‌న ధోర‌ణికి భిన్నంగా క‌నిపించారు.దీంతో ఆయన‌పై ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.భోగి సందేశంలోనూ చంద్ర‌బాబును తిట్టిపారేసే అంబ‌టి అవ‌న్నీ మ‌రిచిపోయి వేడుక‌ల‌కు హాజ‌రుకావ‌డ‌మే విశేషం.అంతేకాదు అంబ‌టి కి పార్టీకి మ‌ధ్య దూరం కూడా ద‌గ్గ‌ర‌య్యే ఛాన్సులు వ‌స్తున్నాయి.వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ ఎందుకు కానీ న‌ర‌సాపురం ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ కాపు నేత కీల‌కం కానున్నారు.న‌ర‌సాపురం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నందున ర‌ఘురామ కృష్ణం రాజుకు దీటుగా ప‌నిచేసేందుకు అంబ‌టే పెద్ద దిక్కు కానున్నారు.క‌నుక ఇప్ప‌టి అవ‌స‌రాల రీత్యా ఆయ‌న‌కు మంత్రి ప‌దవి వ‌చ్చే ఛాన్స్ ఉంది.

ఇంకా చెప్పాలంటే...

ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అని రాయించుకోవ‌డం ఆయ‌న‌కు బాగా ఇష్టం. అందుకు ఆయ‌న చాలా కాలం నిరీక్షించారు.త‌రువాత జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు క‌న్నా మినిస్ట‌ర్ అంబ‌టి రాంబాబు అని రాయించుకునేందుకే ఎక్కువ ఇష్ట‌ప‌డ్డారు.కానీ కాలం క‌లిసి రాలేదు.ఆయ‌న అనుకున్నంత‌గా ఫ‌లితం రాలేదు.దీంతో మినిస్ట‌ర్ రాంబాబు మిస్ట‌రీగానే మిగిలిపోయింది.సంక్రాంతి త‌రువాత అయినా త‌న అదృష్టం మారిపోతుంద‌ని భావిస్తున్న రాంబాబుకు ఈ వేడుకలు బాగా క‌లిసి వ‌చ్చిన విధంగానే ఉన్నాయి.అందుకే ఆట‌పాట‌ల‌తో అద‌ర‌గొట్టాడు.ఇవాళ జ‌రిగిన వేడుక‌ల్లో ఆయ‌న నృత్యాలు  చేస్తూ ఉన్న వీడియోలు చాలా వైర‌ల్ అవుతున్నాయి. ఆ విధంగా పండ‌గ పూట కూడా అంబ‌టి రాంబాబు రాజకీయాల‌ను మ‌రియు సినిమాను వీడ‌కుండా ఉండ‌డం అన్న‌ది నిజంగా గ్రేట్.

ఆయ‌న కొంద‌రు సంప్ర‌దాయ జాన‌ప‌ద క‌ళాకారుల‌తో పాదం క‌లిపి ఆడిపాడుతున్నారు.పండ‌గ క‌దా!అందుకే ఆయ‌న గ‌తం క‌న్నా కాస్త డిఫ్రెంట్ గా మీడియా ముందుకు రావాల‌ని అనుకున్నారేమో! అందుకే ఎమ్మెల్యే రాంబాబు వీలున్నంత ఎక్కువ సేపు డ్యాన్స్ చేశారు.బ‌హుశా సంక్రాంతి త‌రువాత అంబ‌టి రాంబాబుకు ప్ర‌మోష‌న్ ఏమ‌యినా ఇస్తారేమో! మంత్రిగా ఆయ‌న స్థానం క‌న్ఫం అయి ఉంటుంది.మ‌రో రెండున్న‌రేళ్లు జ‌గ‌న్ అధికారంలో ఉండ‌నున్నారు క‌నుక ఆ కొద్దిపాటి స‌మ‌యంలో మంత్రి హోదాలో ఉంటూ కావాల్సినంత పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు.వీటిలో నిజం ఎంత‌? అబ‌ద్ధం ఎంత‌?
మరింత సమాచారం తెలుసుకోండి:

ycp