ఏపీలో మైనారిటీలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారనే సంగతి తెలిసిందే..మైనారిటీ ఓటర్ల ప్రభావం ఉన్న నియోజకవర్గాలు కూడా చాలా తక్కువే. ఇక అటు వైసీపీ నుంచి, ఇటు టీడీపీ నుంచి ముస్లిం అభ్యర్ధులు ఉన్న నియోజకవర్గాలు రెండు మాత్రమే. ఒకటి కడప టౌన్, మరొకటి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలు. ఈ రెండు నియోజకవర్గాల్లో రెండు పార్టీల నుంచి ముస్లిం నేతలే ఉన్నారు.

అసలు కడప అసెంబ్లీ అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇక్కడ టీడీపీకి పెద్ద బలం లేదు. ఇక్కడ ముస్లిం ఓటర్లు మొదట నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి మద్ధతు ఇస్తూ వస్తున్నారు. కడప అసెంబ్లీలో టీడీపీ చివరిసారిగా గెలిచింది 1999 ఎన్నికల్లోనే...మళ్ళీ అక్కడ టీడీపీ విజయం సాధించలేదు. గత నాలుగు ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోతూ వస్తుంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి అంజాద్ బాషా గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన జగన్ క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

అయితే ఈయన పనితీరుకు పెద్దగా మంచి మార్కులు ఏమి పడటం లేదు. కానీ జగన్ ప్రభావం ఉండటం వల్ల కడపలో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది. ఇటు టీడీపీ తరుపున అమీర్ పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంఛి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈయనకు నెక్స్ట్ గెలిచే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే కడపలో వైసీపీ ప్రభావం ఎక్కువ.

ఇటు గుంటూరు ఈస్ట్‌లో వైసీపీ ఎమ్మెల్యేగా ముస్తఫా ఉన్నారు...ఈయన వరుసగా రెండుసార్లు వైసీపీ నుంచి గెలిచారు...ఈయన పనితీరు కూడా అంత ఆశాజనకంగా లేదు. కాకపోతే ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉండటం వల్ల వైసీపీకి ప్లస్ అవుతుంది..ఇక్కడ టీడీపీ తరుపున నజీర్ పనిచేస్తున్నారు. ఈయన యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. ఒకవేళ ఈయన అమరావతి ప్రభావంతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మళ్ళీ ఇక్కడ టీడీపీ గెలుపు కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: