క‌రోనా కార‌ణంగా పాఠ‌శాల‌లో డ్రాపౌట్లు పెరిగిపోతున్నారు. చ‌దువులా ముందుకు వెళ్ల‌క క‌నీస ప‌రిజ్ఞానం కూడా విద్యార్థికి లేకుండా పోతోంది. దీంతో చ‌దువులు, ప‌రీక్ష‌లు అన్న‌వి ఎప్ప‌టిక‌ప్పుడు అవాంత‌రాల‌తోనే న‌డుస్తున్నాయి.ఇంత‌టి సందిగ్ధ‌త‌లో ప‌శ్చిమ‌బెంగాల్ స‌ర్కారు ఓ మంచి నిర్ణ‌యానికే వ‌చ్చింది.అదే ఆరు బ‌య‌ట త‌ర‌గ‌తుల నిర్వ‌హ‌ణ‌. ఇంగ్లీషులో చెప్పాలంటే ఓపెన్ ఎయిర్ క్లాసెస్...నిర్వ‌హ‌ణ‌..దీనిపైనే ఇప్పుడు మమ‌త స‌ర్కారు దృష్టినంతా కేంద్రీక‌రిస్తూ ఉంది. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో!



ఓవైపు చ‌దువులు సాగ‌డం లేదు మ‌రోవైపు క‌రోనా ఉద్ధృతి అస్స‌లు వ‌దిలి పెట్ట‌డం లేదు.మ‌రెలా? చ‌దువులు సాగేదెలా? ఈ మీమాంస నుంచి ప‌శ్చిమ బెంగాల్ బ‌య‌ట ప‌డేందుకు పిల్ల‌ల‌కు ఆరు బ‌య‌ట చ‌దువుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ విధానంలో గాలి వెలుతురు ధారాళంగా సోక‌డంతో పాటు కావాల్సిన రీతిలో భౌతిక దూరం పాటిస్తూ పాఠాలు బోధ‌న చేయించ‌వ‌చ్చ‌న ఆలోచ‌న‌కు సీఎం మమ‌తా బెనర్జీ అంగీకారం తెలిపారు. ఇదే విధానం అన్నింటా త్వ‌రలోనే అమ‌లు కానుంద‌ని కూడా ప‌శ్చిమబెంగాల్ అధికారులు చెబుతున్నారు.అయితే సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించి విద్యార్థుల నుంచి వ‌స్తున్న రెస్పాన్స్ ను కూడా ప‌రిగ‌ణించే త‌రువాత నిర్ణ‌యాల అమ‌లు ఉంటుందని, ఏదేమ‌యినా నేరు బోధ‌న‌కే త‌మ ప్రాధాన్యం ఉంటుంద‌ని, డిజిట‌ల్ క్లాసుల నిర్వ‌హ‌ణ కార‌ణంగా విద్యార్థికి ఏమీ అర్థం కాని స్థితి నెల‌కొని ఉంద‌ని అక్క‌డి అధికారులు చెబుతుండ‌డం విశేషం.

క‌రోనా ఉద్ధృతి కార‌ణంగా ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం ఓ వినూత్న నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై ఒక‌టి నుంచి ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దువుల‌ను ఓపెన్ ఒయిర్ లోనే నిర్వ‌హించాల‌ని భావిస్తోంది.పరే శిక్షాయ్ పేరుతో నిర్వ‌హించే ఈ త‌ర‌గ‌తుల‌కు సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింద‌ని తెలుస్తోంది. క‌రోనా ఉద్ధృతి న‌డుస్తున్నందున పిల్లల చ‌దువులు పెద్ద‌గా సాగ‌డం లేదు. అంతేకాదు ఆన్లైన్ క్లాసులు నిర్వ‌హించినా అవి వారి ఉప‌యోగ‌ప‌డుతున్నాయో లేదో అన్న అయోమ‌యం నెల‌కొని ఉంది. దీంతో చ‌దువుల‌ను ముందుకు తీసుకువెళ్లే క్ర‌మంలో ప‌శ్చిమ బెంగాల్ మొద‌టి విడ‌త‌గా ఒక‌టి నుంచి ఐదు వ‌ర‌కూ పిల్ల‌ల‌కు చదువుల‌ను ఓపెన్ ఎయిర్లోనే నిర్వ‌హించి త‌ద‌నంత‌ర ఫ‌లితాల నేప‌థ్యంలో  మిగ‌తా క్లాసుల విద్యార్థుల‌కూ ఇదే విధానంను అనువ‌ర్తింప జేయాల‌ని భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: