ఈ విషయం అర్ధంకాకే చాలామంది తమ్ముళ్ళలో అయోమయం పెరిగిపోతోంది. ఒకసారి చాలా యాక్టివ్ గా ఉండే విజయవాడ ఎంపీ కేశినేని నాని మరో సందర్భంలో అసలేమీ పట్టనట్లుగా ఉంటున్నారు. ఒకసారి పార్టీ కార్యక్రమాల్లో బిజీగా కనిపించిన ఎంపి మరో కార్యక్రమంలో తనకేమీ సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఒక్కో సందర్భంలో ఒక్కోలాగ వ్యవహరిస్తున్న కేశినేని మనసులో ఏముందో అర్ధంకావటంలేదు.




చివరకు వంగవీటి రాధాపై రెక్కీ జరిగిందని విషయం తెలియగానే ఎంపీ ఎంతగా హడావుడి చేశారో అందరు చూసిందే. మంత్రి  కొడాలి నాని వివిధ సందర్భాల్లో చంద్రబాబునాయుడును బూతులు తిడుతున్నా తనకేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేతనే కొడాలి అంతేసి మాటలంటున్నా ఎంపీ ఎందుకు రియాక్టవటంలేదో కూడా సీనియర్ నేతలకు అర్ధం కావటంలేదు. పార్టీలో ఎంపీకి ఆయన ప్రత్యర్ధివర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది వాస్తవం.




ఈ పోరులో ఒక్కోసారి ఎంపీది మరోసారి ప్రత్యర్ధివర్గానిది పై చేయవుతోంది. దాంతో రెగ్యులర్ గా తనదే పై చేయి కావాలని ఎంపీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబుతో కూడా దూరం మెయిన్ టైన్ చేశారు. అయితే తెరవెనుక సర్దుబాటు కారణంగా ఎంపీని చంద్రబాబు మళ్ళీ దగ్గరకు తీసుకున్నారు. అప్పటి నుండి ప్రత్యర్ధివర్గం మండిపోతోంది.




ఎంపీ ప్రత్యర్ధివర్గంలో మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, సీనియర్ నేత నాగూల్ మీరా కీలకం. వీళ్ళకు మాజీ మంత్రి దేవినేని ఉమ అండదండలున్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఎంపీకి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వటం మొదలైందో పై ముగ్గురు నేతలకు కేశినేనిపై మంట బాగా పెరిగిపోయింది. మరి చంద్రబాబు ఎంపీకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నా కొడాలి అంత తిడుతున్నా ఎంపి ఎందుకు నోరిప్పటంలేదో అర్ధం కావటంలేదు. మొత్తంమీద ఎంపి వైఖరి అర్ధంకాక మిగిలిన నేతల్లో పిచ్చెక్కిపోతోంది.  అయితే ఏమి చేయాలో తెలీకపోవటంతో అందరు మౌనంగా ఉండిపోయారు.



మరింత సమాచారం తెలుసుకోండి: