
అందుకు తగ్గట్టే శ్రీరామ్ కూడా పనిచేస్తున్నారు...అయితే ఇటీవల ధర్మవరం సీటు విషయంలో ఒక ట్విస్ట్ వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు తీసుకుంటారని ఆయన అనుచరులు బహిరంగంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఎందుకంటే గతంలో సూరి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు..పైగా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి, బీజేపీలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆయన టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని తెలుస్తోంది...అలాగే ధర్మవరం సీటు తీసుకోవాలని చూస్తున్నారు.
కానీ పార్టీలోకి ఎవరు వచ్చిన ధర్మవరం సీటు మాత్రం తనదే అని శ్రీరామ్ అంటున్నారు...సూరి అనుచరుల వ్యాఖ్యల తర్వాత మరింత ఎక్కువగా శ్రీరామ్ ధర్మవరంలో పనిచేస్తున్నారు. తాజాగా ధర్మవరం రెవెన్యూ డివిజన్ని పునరుద్ధరించాలని చెప్పి దీక్ష కూడా చేశారు. ఇటీవల జిల్లాల విభజనలో భాగంగా ధర్మవరం రెవెన్యూ డివిజన్ని రద్దు చేసి పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై ధర్మవరం ప్రజలు ఫైర్ అవుతున్నారు..ఇక ఈ అంశంపై శ్రీరామ్ పోరాటం చేస్తున్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సూరి సైతం దీనిపై పోరాడుతున్నారు...దీంతో శ్రీరామ్ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. అంటే ధర్మవరం సీటు కూడా దక్కించుకోవాలనే ఉద్దేశంతో శ్రీరామ్ దూకుడు పెంచారని అర్ధమవుతుంది.