చావు బతుకుల మధ్య ఉన్న సమయం లో కూడా ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించి తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు ముఖ్య మంత్రిగా ఎన్నికైన ఆయన తిరుగులేని విధంగా పాలన సాగిస్తున్నారు. కాగా నేడు గులాబీ దళపతి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సందడి నెలకొంది. టిఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కెసిఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. బర్త్ డే కేకులు కట్ చేసి కెసిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం ముఖ్య మంత్రి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కెసిఆర్ పుట్టిన రోజునా శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాల తో వుండాలని, మీ లక్ష్య సాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ చెప్పారు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి