తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో ప్రభుత్వం మొత్తం పొంగూరు నారాయణ చుట్టే తిరిగింది. నారాయణ అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి+సీఆర్డీయే వైస్ ఛైర్మన్ గా వ్యవహరించారు. పేరుకు మాత్రమే నారాయణ మంత్రి కానీ రాజధాని వ్యవహారాలు మొత్తం ఈయన మీదే జరిగాయి. రాజధాని నిర్మాణానికి అమరావతిని ఎంపికచేయటం, సరిహద్దులు నిర్ణయించటం, భూసమీకరణ, పరిహారం నిర్ణయం, చెల్లింపు, భూకేటాయింపులు, సింగపూర్ సంస్ధల ఫిక్సింగ్ ఇలా.. మొత్తం నారాయణే కీలకం.





అలాగే పది, ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ విద్యాసంస్ధలపై ఆరోపణ లేని రోజులేదు. అప్పటి ప్రతిపక్షం అసెంబ్లీలోపలా బయట ఎన్ని ఆరోపణలు చేసినా చంద్రబాబునాయుడు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతి ప్రశ్నపేపర్ నారాయణ స్కూల్లో నుండి లీకైందని, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు బాధ్యత వహించాలని వైసీపీ ఎంత డిమాండ్ చేసినా ప్రభుత్వం లెక్కేచేయలేదు. పైగా ఎదురుదాడి చేసి జగన్+వైసీపీ నేతల నోళ్ళు మూయించే ప్రయత్నాలు అందరికీ తెలిసిందే.





సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం. దాంతో ఐదేళ్ళపాటు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన, రెచ్చిపోయిన నారాయణ అడ్రస్ ఎవరికీ కనబడలేదు. చివరకు టీడీపీ నేతలకు కూడా మాజీమంత్రి ఆచూకీ దొరకలేదు. తమ్ముళ్ళు ఎవరితోను నారాయణ టచ్ లో లేరు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో కూడా ఎక్కడా కనబడలేదు. దాంతో తమ్ముళ్ళు నారాయణ అనే వ్యక్తి టీడీపీలో ఉన్నారని కూడా మరచిపోయారు. ఎందుకంటే ఏదో రూపంలో ప్రభుత్వం తనను అరెస్టు చేసే అవకాశం ఉందని నారాయణ అనుమానించే చాలా లో ప్రొఫైట్ చేస్తున్నారు. ఒకదశలో నారాయణ కూతురు జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు కూడా ప్రచారం జరిగింది.





ఇంత లో ప్రొఫైల్ మైన్ టైన్ చేస్తున్నా నారాయణ అరెస్టు తప్పలేదు. కారణం ఏమిటంటే పాతకేసులు కాదు. తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. మొదటిదేమో 10వ తరగతి ప్రశ్నపత్రాలు లీకేజీలో నారాయణ విద్యాసంస్ధ కీలక పాత్ర పోషించటం. రెండోదేమో అమరావతి భూసమీకరణపై అందిన కొత్త ఫిర్యాదు.  తాజా ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన ఏపీసీఐడీ పోలీసులు ఏ1 గా చంద్రబాబు, ఏ2 పంగూరు నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4 గా లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఏ5గా కేపీవీ అంజనీకుమార్, ఏ 6 గా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఉంది. తిరుపతిలోని నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి అప్రూవర్ గా మారి ప్రశ్నపత్రం లీకేజీలో నారాయణ పేరు చెప్పటంతోనే నారాయణ అరెస్టు జరిగినట్లు సీఐడీ పోలీసులు చెప్పారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: