వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముగ్గురు మాజీమంత్రులపై టార్గెట్ పెట్టుకున్నారట. ఆ ముగ్గురు కూడా  కృష్ణాజిల్లాలోనే ఉన్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే కొడాలినాని, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఈ ముగ్గురిపైనే జిల్లాలో పవన్ ఎందుకు టార్గెట్ పెట్టారంటే వీళ్ళు పవన్ను బాగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టే.


నిజానికి వీళ్ళముగ్గురి గురించి పవన్ కూడా నోటికొచ్చినట్లు కామెంట్లు చేశారు. తమను పవన్ కామెంట్ చేశార కాబట్టే వీళ్ళు కూడా రెచ్చిపోయారు. ఇక్కడ సమస్య ఏమిటంటే తాను ఎవరిని ఏమన్నా అనచ్చు కానీ తనను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదే పద్దతిలో ఉంటారు పవన్. తనను ఎవరైనా ఏమన్నా కామెంట్ చేస్తే స్కూలు పిల్లలు హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లే ఉంటుంది పవన్ మాటలు.

అసలు ఎదుటి వాళ్ళని అనటం ఎందుకు వాళ్ళతో తాను అనిపించుకోవటం ఎందుకనే ఆలోచన అస్సలుండదు. అంటే పవన్ తనపై  విమర్శను, ఆరోపణను కూడా సహించేస్ధితిలో లేరన్న విషయం అర్ధమైపోతోంది. సరే ఇతరేతర విషయాలు ఎలాగున్నా కొడాలిని గుడివాడలోను, పేర్నిని మచిలీపట్నంలోను, వెల్లంపల్లిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోను ఓడించాలన్నది పవన్ పట్టుదల. అయితే మూడు నియోజకవర్గాల్లోను పార్టీనుండి గట్టి అభ్యర్ధులే లేరు. మరి వీళ్ళని ఓడించకపోతే పరువంతా పోతుంది. ఇలాంటి వాళ్ళు మరికొందరు ఉన్నా గట్టిపట్టుదలతో ఉన్నది మాత్రం వీళ్ళపైనేనట

ఇలాంటి అనేక కారణాలతోనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్నది పవన్ ఆలోచనట. రేపటి ఎన్నికల్లో తాను గెలవాలన్నా టీడీపీతో పొత్తులేకపోతే గెలుపు సాధ్యంకాదన్న విషయం ఇప్పటికే పవన్ కు అర్ధమైపోయిందట. పవన్ రెండే పాయింట్ల మీద రాజకీయం చేస్తున్నారు. మొదటిదేమో తాను గెలవటం. రెండోదేమో తాను టార్గెట్ చేసిన వాళ్ళని ఓడించటం. ఒంటరిగా పోటీచేసే రెండు కూడా జరిగేపనికాదు. అందుకనే టీడీపీతో కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటారనే టాక్ వినిపిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: