ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో రాజకీయం గందరగోళంగా ఉంది. మునుగోడులో ఉప ఎన్నికకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుండి రాజకీయ పార్టీలు అన్నీ ఫుల్ జోష్ లో ఉన్నారు. గెలుపు కోసం ఎవరికి తోచిన ప్రణాళికలు వారు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికలో అన్ని పార్టీల కన్నా కూడా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చాలా అవసరం. ఎందుకంటే మామూలుగానే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో అసలు ఆదరణ కలగడం లేదు. అలాంటిది ఎటువంటి ఆలోచన చేయకుండా సడెన్ గా పార్టీ మారిపోయారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఇక్కడ తెరాస మరియు కాంగ్రెస్ లను దాటుకుని గెలుపు సాధించడం అంత సులభం కాదు.

దీనికి ఎన్ని ప్రణాళికలు వెయ్యాలి ? ఎన్ని వ్యూహాలు రచించాలి అన్నది ముందు చూసుకోవాలి. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను లిస్ట్ అవుట్ చేసుకుని.. దానికి కారణం అయిన వారిని టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తే గెలిచే అవకాశాలు ఉండొచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరో వైపు నుండి ఆ సమస్యలను ఏ విధంగా బీజేపీ పరిష్కరిస్తుంది అన్నది అజెండాలో ఉంచాలి. అప్పుడే కొంతమేరకు బీజేపీ పై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది అన్నది మరికొందరి ఉద్దేశ్యం. అయితే ఇక్కడ బీజేపీకి ఉన్న పెద్ద సమస్య ఒకటుంది... ఇక్కడ ప్రజలు బీజేపీ గురించి సానుకూల అభిప్రాయాన్ని కలిగి లేరు. బీజేపీ మాకు ఏమి చేసింది అని మేము ఓటేయాలి అంటూ ప్రజలు ఆలోచిస్తున్నారు.

బీజేపీ కోసం పని చేశున్న వారు తప్పించి. అంటే బీజేపీ కార్యకర్తలు మరియు రాజగోపాల్ రెడ్డి అనుచరులు మాత్రమే ఓట్లు వేసే పరిస్థితి. ఇక ఉన్న ఈ తక్కువ సమయంలో బీజేపీ ప్రజల మనసును గెలుచుకునే ప్రసక్తే లేదని తెలుస్తోంది. కాకపోతే. ఇంతకు ముందు మనము చెప్పుకున్నట్లుగా బీజేపీ ప్రచారంలో ప్రజలకు చేసే విషయాలు స్పష్టంగా తెలియచేయగలిగితే కొంతవరకు ఓట్లు పెరిగే ఛాన్స్  ఉంది. ఇప్పటి వరకు ఉన్న టెంపో ప్రకారం ఈ ఎన్నికలో కాంగ్రెస్ కే గెలిచేందుకు ఎక్కువ శాతం ఛాన్స్ ఉందట.


 

మరింత సమాచారం తెలుసుకోండి: