కుప్పం నియోజకవర్గంలో  చంద్రబాబునాయుడు దశాబ్దాలుగా ఎదురులేకుండా గెలుస్తున్నారు. 1989 నుండి ఇక్కడ చంద్రబాబు నామినేషన్ వేస్తే గెలవటమే. గెలుపు విషయంలో చంద్రబాబు ఎంత కాన్ఫిడెన్సుగా ఉంటారంటే నామినేషన్ వేయటానికి కూడా చంద్రబాబు వెళ్ళరు. తన తరపున ఎవరో లాయర్ ను కుప్పం పంపుతారు. ప్రచారంలో కూడా ఏదో తప్పదన్నట్లుగా ఒకసారి వచ్చి రోడ్డుషో చేసి నేతలతో మాట్లాడి వెళిపోతారు. అయితే ఎన్నికల్లో మాత్రం చంద్రబాబుకు వేలకు వేల ఓట్ల మెజారిటి వచ్చేస్తోంది.





నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసుంటే వేల మెజారిటి వస్తోందని సరిపెట్టుకోవచ్చు. కానీ కుప్పంలో డెవలప్మెంట్ కూడా పెద్దగా కనబడలేదు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరగాల్సిన డెవలప్మెంట్ అయితే లేదు. రోడ్లు సరిగా ఉండవు, మంచినీటి సౌకర్యంలేదు. సంక్షేమపథకాలు సరిగా అందేవికాదు. పోనీ పారిశ్రామికంగా అద్భుతంగా ఉందా అదీలేదు. అయినా వేల ఓట్ల మెజారిటి ఎలా సాధ్యమవుతోంది ?






ఎలాగంటే బోగస్ ఓట్ల మహిమ. అదేదో సినిమాలో హీరో ప్రతిదానికీ తావీదు మహిమ అని డైలాగు చెబుతుంటాడు. అదేపద్దతిలో కుప్పంలో దొంగ ఓట్ల కారణంగానే చంద్రబాబుకు వేల ఓట్ల మెజారిటి వస్తోందని తాజాగా బయటపడింది. నియోజకవర్గం ఓట్లలో సుమారు 60 వేల బోగస్ ఓట్లున్నట్లు బయటపడింది. అధికారుల డోర్ టు డోర్ తనిఖీలో ఇప్పటికి సుమారు 28 వేల దొంగ ఓట్లు బయటపడ్డాయి. వీటన్నింటినీ ఓటర్లజాబితాలో నుండి తొలగించారు.






బోగస్ ఓట్ల ఏరివేత కార్యక్రమం ఇంకా జరుగుతోంది. ఎప్పుడైతే దొంగఓట్ల ఏరివేత కార్యక్రమం మొదలైందో వెంటనే టీడీపీ వాళ్ళు ఎదురుదాడులు మొదలుపెట్టారు. అన్యాయంగా తమ పార్టీ ఓట్లను తొలగిస్తున్నట్లు గోలచేస్తున్నారు. ఇపుడే కాదు గతంలో కేంద్ర ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన బన్వర్ లాల్ కూడా కుప్పంలో వేలాది బోగస్ ఓట్లున్నట్లు ప్రకటించారు. కాబట్టి మొదటినుండి చంద్రబాబు గెలుపులో బోగస్ ఓట్లదే కీలకమైన పాత్ర. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి గట్టిగా దృష్టిపెట్టేటప్పటికి ఒడ్డునపడ్డ చేప లాగ టీడీపీ నేతలు గిలగిల్లాడిపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: