ఉరుములేని పిడుగులాగ సడెన్ గా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. ఇంత సడెన్ గా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ?  ప్రధానమంత్రి ఆఫీసు నుండి అర్జంటుగా రమ్మని జగన్ కు కబురొచ్చిందనేది సమాచారం. దాని కారణంగానే జగన్ సడెన్ గా ఢిల్లీకి వెళుతున్నారట. ఇంత సడెన్ గా జగన్ను ఢిల్లీకి రమ్మని మోడీ ఆఫీసు నుండి ఫోన్ ఎందుకు వచ్చినట్లు.  రాష్ట్రంలో హఠాత్తుగా మొదలైన ఇంపార్టెంట్ పొలిటికల్ డెవలప్మెంట్లు కూడా ఏమీలేవు.





ఏపీకి కేంద్రం అర్జంటుగా మంజూరుచేసే ప్రాజెక్టులు కూడా ఏమీలేవు. అలాంటిది జగన్ను ఎందుకు రమ్మనట్లు ? గురువారం రాత్రికి ఢిల్లీకి చేరుకుంటున్న జగన్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముందు తర్వాత మోడీతో భేటీ అవబోతున్నారు. ఇద్దరితోను భేటీ అవబోతున్నారంటే చాలా ఇంపార్టెంట్ మీటింగని అర్ధమైపోతోంది. అదే ఎందుకున్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు.





అయితే అందుబాటులోని సమాచారం ప్రకారం మూడు అంశాలపై చర్చించేందుకే అని అనుకోవచ్చు. అవేమిటంటే మొదటిది జగన్ విశాఖపట్నంకు మారుతుండటం. రెండోది వైజాగ్ లో జరగబోతున్న  జీ 20 సమ్మిట్ ఏర్పాట్లపై వ్యక్తిగతంగా సమీక్షించటం. మూడోది మార్గదర్శి సంస్ధ ఛైర్మన్ రామోజీరావుపై చీటింగ్ కేసు నమోదు చేయటం. జగన్ విశాఖకు మారే విషయం కొత్తదేమీకాదు. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ కలిసే అవకాశాలు తక్కువే.





ఇక జీ 20 సమ్మిట్ నిర్వహణ మోడీకి అత్యంత ప్రతిష్టతో కూడినది. కాబట్టి దీనికి అవకాశముంది. అలాగే రామోజీ మీడ చీటింగ్ కేసు కూడా కీలకమైనదే. ఎందుకంటే మోడీ, అమిత్ ఇద్దరితోను రామోజీకి మంచి సంబంధాలే ఉన్నాయి. దాడులు, కేసులతో రామోజీని జగన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జగన్ దెబ్బను రామోజీ తట్టుకోలేకపోతున్నట్లున్నారు. అందుకనే జగన్ స్పీడుకు బ్రేకులు వేయాలంటే అది మోడీ వల్లమాత్రమే సాధ్యమవుతుందని రామోజీకి బాగా తెలుసు. బహుశా ఫోన్లో మోడీ, అమిత్ షా తో రామోజీ ఏమన్నా మాట్లాడారా ? అన్న అనుమానాలున్నాయి. చూద్దాం శుక్రవారంకు ఏ విషయం తెలుస్తుందిగా.



మరింత సమాచారం తెలుసుకోండి: