
ఇక ఇదే కాన్సెప్ట్ తో సినిమా మొత్తం సాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను అటు తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్లో అమలు చేసేందుకు సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం కీలక పథకం ప్రారంభించబోతుంది అన్నది తెలుస్తుంది. మాతృభూమి యోజన పేరుతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త పథకాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నగరాలు, విదేశాలకు వలస పోయిన యూపీ స్థానికులు తిరిగిన పల్లెలను ఆదుకునేందుకు ముందుకు వచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అని చెప్పాలి. తద్వారా యూపీలోని పల్లెల్లోను వెలుగులు నింపాలనే లక్ష్యంతో ఇక యోగి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
విదేశాల్లో ఉన్న ఎన్నారైలకు మాత్రమే పరిమితం చేసిన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత నగరాలకు వెళ్లిన వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేసి విస్తరింప చేయాలని అనుకుంటున్నారట. నగరాల్లో లేదా విదేశాల్లోకి వెళ్లి అక్కడే పని చేస్తూ సెటిల్ అయిన వారిని తమ గ్రామాలతో మళ్ళీ కనెక్ట్ అయ్యేలా చేయడానికి.. గ్రామ అభివృద్ధికి సహాయం చేసి ఇక మౌలిక వసతులు కల్పించడం కోసం డబ్బును విరాళంగా ఇచ్చే విధంగా చేయడం కోసమే.. ఈ పథకాన్ని యోగి సర్కార్ ప్రారంభించినట్లు చెబుతుంది. ఇక ఈ పథకం ద్వారా రెండు రకాలుగా ఉపయోగముందని చెబుతుంది. మొదటిది వ్యక్తులు వారి మూలాలతో తిరిగి కనెక్ట్ కావడం అలాగే తమ మాతృభూమికి సాయం చేయడం లాంటి ఉపయోగాలు ఉన్నాయట.