ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి ఎంత రాజుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉంది   మొన్నటి వరకు అన్ని పార్టీలు ప్రచార హోరుతో దూసుకుపోయాయి. అయితే ఇటీవల పోలింగ్ ముగిసింది. సాధారణంగా ఎక్కడైనా పోలింగ్ ముగిసిన తర్వాత పరిస్థితులు చక్కబడుతూ ఉంటాయి. రాజకీయ వేడి కూడా తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పోలింగ్ జరిగే రోజు నుంచి ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఇక ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. ఇక ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు.


 దీంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకునేందుకు.. ఇక ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసిన పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ఈసారి ఏపీలో గెలవబోయే పార్టీ ఏది అధికారాన్ని చేతికించుకోబోయేది ఎవరు అనే విషయంపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. టిడిపి జనసేన బిజెపి పార్టీలతో కూటమిగా ఏర్పడి ముందుకు సాగితే.. వైసిపి ఒంటరిగానే బరిలోకి దిగింది. తమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాతో ఉంది. అయితే కూటమి వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చి మరిచిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ సక్సెస్ అయిందని వాదన కూడా వినిపిస్తోంది.


 ఇక ఎక్కువ శాతం మరోసారి జగన్ ఆంధ్రాలో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేస్తున్నారు నిపుణులు. అయితే ఆంధ్రాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఏ ప్రెస్ మీట్ లో చూసిన ఆంధ్రలో ఎవరు అధికారంలోకి వస్తారు అనే నాయకులకు ప్రశ్నలు ఎదురవుతున్నాయ్. ఇటీవల మీడియాలో నిర్వహించిన చర్చలో రేవంత్ రెడ్డి కి కూడా ఇదే ప్రశ్న ఎదురయింది. ఆంధ్రలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చిన వాళ్లతో సఖ్యతగా ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు. అంతా పాజిటివ్ థింకింగ్ మాత్రమే అని.. నో నెగిటివ్ థింకింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన దృష్టి మొత్తం తెలంగాణ నే అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: