ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో... గెలుపు ఓటముల పై అన్ని పార్టీలు చర్చించుకుంటున్నాయి. తమదంటే తమది గెలుపు అంటూ... వైసిపి పార్టీలు పోటాపోటీ పడుతున్నాయి. ఏపీలోని చాలా ప్రాంతాలలో... జోరుగా బెట్టింగ్ లు కూడా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా... ఏపీలో మా పార్టీ గెలుస్తుందని... వైసిపి అంటుంటే... కాదు కాదు... తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని కొంతమంది అంటున్నారు.

 అయితే చాలా సర్వేలు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర బీజేపీ కూడా ఇటీవల  పోస్ట్ పోల్ సర్వే కూడా చేయించిందట. అందులో కూడా కూటమి అధికారంలోకి వస్తుందని తేలిందట. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో... తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతేకాదు మంత్రి పదవులు... ముఖ్యమంత్రి పదవులను డిసైడ్ చేసేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

 అయితే ఇలాంటి నేపథ్యంలోనే  తెలుగుదేశం పార్టీ యూత్ వింగ్... సరికొత్త అంశానికి తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ కు  ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కొత్త డిమాండ్ తీసుకువస్తుంది.  చంద్రబాబు నాయుడు గారికి... తెలుగుదేశం పార్టీ.... లోకేష్ కు మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే... పార్టీ నడవడం కష్టం అంటున్నారు.

 అన్ని భాగాలలో నారా లోకేష్ అనుభవజ్ఞుడు  అయి ఉన్నాడని... అందుకే లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అంటున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలో... జనసేన పార్టీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని వదిలేసి నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే... తమ నాయకుడికి అన్యాయం జరిగినట్లే అని... జనసేన నాయకులు అలాగే కార్యకర్తలు అంటున్నారు. ఇదే అంశాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

 నారా లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి... ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ముందుకు...  పేరుతో బిజెపి కూడా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా... మొదలు... నారా లోకేష్ ను మంగళగిరి నియోజకవర్గంలో గెలవమనండి... ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి చూద్దాంలే అని కొంతమంది అంటున్నారట. దీంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: