నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఊరికే అనలేదు మన పెద్దలు. అందుకే నోటిని అదుపులో పెట్టుకోవాలి. దేవుడు నోరు ఇచ్చాడని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ.అలాకాకుండా నోరుంది కదా అని ఎలాపడితే అలా మాట్లాడితే దాని పర్యవసానం భవిష్యత్‌లో ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది అనేదానికి మాజీ మంత్రి ఆర్కే రోజా నిదర్శనంగా నిలుస్తుంది. జనాలు తమకు మంచి చేస్తారని నమ్మి రోజాను నమ్మి ఆమెకు ఓట్లు వేసి గెలిపిస్తే.. ఆమె జగన్ అన్న అంటూ జగన్‌కు భజన చేయడానికే అధికారం ఇచ్చినట్టు వ్యవహరించింది. సరే పార్టీ అధినేత కాబట్టి భజన చేసుకోవచ్చు. తప్పులేదనుకుందాం. అక్రమాలకు, అవినీతికి బ్రాండ్ ఎంబాసిడర్‌గా రోజా మారింది. రాష్ట్రంలో రోడ్లు బాగాలేక జనాలు ఇబ్బందులు పడుతుంటే ఆవిడ మాత్రం బెంజ్ కార్లు నీళ్లు తాగినంత ఈజీగా కొనేస్తుంది.  రోజా మాట్లాడే తీరు రోజా చేష్టలకు విసిగిపోయిన ఆంధ్రా ప్రజలు 2024 ఎన్నికల్లో రోజాకి తగిన బుద్ధి చెప్పి ఆమె నోటికి తాళం వేసి ఇంటికి పంపారు.ప్రతిపక్ష నేతలను రాజకీయంగా విమర్శించవచ్చు కానీ, వారిని తిట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా తప్పు. దాని పర్యవసానం రోజా ఇప్పుడు అనుభవిస్తుంది.జగన్‌ భజన చేయడం, ప్రతిపక్షాలపై పర్సనల్ అటాక్, బాడీ షేమింగ్ చేయడం తప్పా గత ఐదేళ్లలో పర్యాటక శాఖ మంత్రిగా రోజా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. 


రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న విషయాన్ని మరిచి సాటి మహిళలే అసహ్యించుకునేలా రోజా మాట్లాడింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలక్రష్ణ చివరికి చంద్రబాబు కుటుంబంలోని మహిళలను సైతం ఆమె దుయ్యబట్టింది. అధికారం శాశ్వతం అన్నట్టు ఆమె వ్యవహరించిన తీరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కేవలం ప్రతిపక్షం నేతలతోనే కాదు, ఇటు సొంత పార్టీ నేతలతో కూడా సఖ్యంగా ఉండలేకపోయింది.దీనితో 2024 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని, ఇచ్చినా ఆమె గెలవదని సొంత పార్టీ నేతలే జగన్‌ మోహన్ రెడ్డిని కోరడం విశేషం. అయితే జగన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆమెకు టిక్కెట్ ఇచ్చాడు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ చాలా దారుణంగా పరాజయం పాలైంది. అలానే రోజా విషయం జగన్‌కు కూడా అర్థమైనట్టుంది. అందుకే 2029 ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వకపోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైగా పక్క పార్టీ లకి వెళ్లాలన్న ఈమె మాట తీరు చూసి వేరే పార్టీ వాళ్ళు సైతం ఆమెని పార్టీలో చేర్చుకోవడానికి భయపడుతున్నారు. దీంతో రోజా పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయ్యిందా అనే కామెంట్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: