టీడీపీలోని ప్రముఖ నేతలలో గొట్టిపాటి రవికుమార్ ముందువరసలో ఉంటారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికి పార్టీలో మంచి పేరు ఉంది. బీటెక్ చదివిన గొట్టిపాటి రవికుమార్ కు చంద్రబాబు విద్యుత్ శాఖ కేటాయించారు. అయితే గొట్టిపాటి రవికు గనుల శాఖలో ఊహించని స్థాయిలో అనుభవం ఉంది. గొట్టిపాటి రవి స్వతహాగా గ్రానైట్ వ్యాపారి కావడం గమనార్హం.
 
2004 సంవత్సరంలో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ 2009లో అద్దంకి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మార్టూరు రద్దవ్వడంతో ఆయన అద్దంకికి మారాల్సి వచ్చింది. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే వేర్వేరు కారణాల వల్ల గొట్టిపాటి రవి 2016 సంవత్సరంలో టీడీపీలో చేరారు.
 
2019, 2024 ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యేగా విజయం సాధించిన గొట్టిపాటికి స్థానికంగా మంచి పేరుంది. కొల్లు రవీంద్రకు గనుల శాఖను కేటాయించగా ఆయన కంటే గొట్టిపాటి రవి ఈ శాఖకు ఎక్కువగా న్యాయం చేసేవారని కామెంట్లు వినిపిస్తున్నాయి. గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖను కేటాయించడం వల్ల పెద్దగా లాభం అయితే ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
గొట్టిపాటి రవికుమార్ బిజినెస్ మేన్ గా కూడా మంచి పేరు ఉండటం గమనార్హం. తొలిసారి మంత్రి పదవి దక్కడంతో గొట్టిపాటి రవి ఎంతో సంతోషిస్తున్నారు. గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ కత్తి మీద సామేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాబు శాఖల కేటాయింపు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. గొట్టిపాటి రవి మాత్రం తనకు కేటాయించిన శాఖ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. గొట్టిపాటి రవి విద్యుత్ శాఖ గురించి అవగాహన ఏర్పరచుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: