తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇపుడు పూర్తిస్థాయి పాలనపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా సమాచారం మేరకు అయితే ముఖ్యమంత్రి కాకుండా మొత్తం 11 మంది కేబినెట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వారు మాత్రమే కాకుండా త్వరలో మరో నలుగురికి కేబినెట్ లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళితే.... నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి చాన్స్ ఇవ్వనున్నట్లు వినికిడి. అదే విధం గా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముదిరాజ్ కోటాలో అవకాశం దక్కనున్నట్లు సమాచారం. అలాగే భువనగిరి ఎంపీ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు బాటలో పయనించిన కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డికి మంత్రి వర్గం లో చోటు దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్‌ను సైతం మంత్రి వర్గం లో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మంచిర్యాలు ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు పేరు వినిపిస్తోంది.

ఇక్కడ ప్రస్తుతం ఒక సమస్య నెలకొంది. వీరిద్దరిలో ఎవరికీ ఛాన్స్ ఇస్తారనేది ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చాలా ఉత్కంఠగా మారింది. ఎస్టీల నుంచి ఒకరికి మైనార్టీల నుంచి మరొకరికి అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అదే విధంగా ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఒకరికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వనున్నట్లు కూడా సమాచారం ఉంది. తొలుత నలుగురికి అవకాశం కల్పించి మిగతా ఇద్దరకి తర్వాత మంత్రిగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఇకపోతే జూన్  21న తెలంగాణ  కేబినెట్  సమావేశం కానుంది. ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యం లో కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: