ప్రభుత్వ కీలక వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన కొన్ని కామెంట్లు సైతం ఈ ప్రచారం నిజం అయ్యే అవకాశం ఉందనే నమ్మకాన్ని అయితే కలిగిస్తున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఇప్పటికే ఇందుకు సంబంధించి ఒక కమిటీ కూడా ఏర్పాటు కావడం గమనార్హం.
ఈ కమిటీ ప్యానెల్ సిఫార్సు ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత 100 రోజులకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. త్వరలో లా కమిషన్ కు సైతం ఇందుకు సంబంధించిన సిఫార్సు చేయనున్నారని తెలుస్తోంది. 2029 సంవత్సరంలో లోక్ సభ, రాష్ట్రాల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ, పంచాయితీ ఎన్నికలను నిర్వహించేలా సిఫార్సులు ఉన్నాయి. ఈ కమిటీ త్వరలో లా కమిషన్ కు సైతం సిఫార్సు చేయనుందని తెలుస్తోంది.
దశల వారీగా దేశంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆ ప్రభావం దేశ ప్రగతిపై కూడా పడుతున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల సమయంలో మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఒకే దేశం ఒకే ఎన్నికను అమలు చేయడానికి అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందని సంబంధిత వర్గాలు సైతం ఫీలవుతున్నాయి. ఈ విధానం విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.