ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య వార్ ముదిరిన సంగతి మనకు తెలిసిందే.ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ దొంగ దెబ్బ తీయాలని భారత్ పై చీకటి పడ్డాక ఎన్నో డ్రోన్లతో ప్రతీకార దాడులను తీర్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో పాకిస్తాన్ భారత్ ని ఎలాగైనా తిప్పి కొట్టాలని ఎన్నో ప్రతీకార చర్యలకు పూనుకుంటున్నప్పటికీ వాటిని భారత ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ భారత్ పై సంచలన ప్రకటన చేసింది.ఆపరేషన్ సిందూర్ పేరిట ఎలా అయితే భారత్ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను మట్టు పెట్టిందో అలాగే భారత్ పై కూడా పాకిస్తాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే భారతదేశంపై పూర్తిస్థాయి ఆర్మీ ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి 'ఆపరేషన్ బన్ యన్ వుల్ మర్సూస్' అనే పేరుని పెట్టినట్లు పాకిస్తాన్ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పుకొచ్చారు. 

అయితే ఈ పేరుతో భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు పాకిస్తాన్ చేపట్టిన ప్రతి ఒక్క ప్రతికార చర్యను భారత్ తిప్పికొడుతూ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ భారత్ పై మరిన్ని దాడులు చేసి యుద్ధాన్ని తీవ్రతరం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. కానీ భారత ఆర్మీ మాత్రం పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పి కొడుతూనే ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ పై ఎన్నో మిస్సైల్ లను పంపించినప్పటికీ వాటన్నింటినీ గగనతనంలోనే కూల్చి వేస్తోంది భారత ఆర్మీ. ఇప్పటికే పలుచోట్ల బాంబు బెదిరింపులతో పాటు మిస్సైల్ లను కూడా ప్రదర్శించింది.

 కానీ వీటన్నింటిని భరత్ ఆర్మీ తిప్పికొడుతూ పాకిస్తాన్ కి సరైన బుద్ధి చెబుతోంది.ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం పాకిస్తాన్ కి తీరని లోటు ఏర్పడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్న యుద్ధం ఆపివేయాలని శాంతి చర్చలు జరపాలని పలు దేశాలు చెప్పుకొస్తున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఎప్పటికప్పుడు ఇలాంటి దొంగ దెబ్బలు తీస్తూనే ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టాలని భారత్ చూస్తే పాకిస్తాన్ వాళ్ళు మాత్రం భారత్లో ఉన్న జనావాసాలనే టార్గెట్గా చేసుకొని మిస్సైల్ దాడులను చేస్తున్నాయి. ఇప్పటికే జమ్ము కాశ్మీర్,రాజస్థాన్, పంజాబ్ వంటి ప్రాంతాలపై డ్రోన్ ల దాడి చేపడుతోంది. కానీ ఈ డ్రోన్లని గగనతలంలోనే ఇండియా ఆర్మీ చిత్తు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: