పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్స్ సింధూరి తో పాటు ధీటుగా బదిలిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావ‌రాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ కు చెందిన సుమారు 7.5 లక్షల ట్రక్కులు వాహనాలను సైన్యం కు అందిస్తామని ఆ రాష్ట్ర ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ భారత సైన్యానికి హామీ ఇచ్చింది .. ఈ మేరకు ఇండోర్లోని ఏఐటిఎంసి రాష్ట్ర ఛీప్ సిఎల్ ముకాఠి మీడియాతో మాట్లాడారు. భారత సైన్యానికి మధ్యప్రదేశ్లో రిజిస్టర్ అయిన దాదాపు 7.5 లక్షల ట్రక్కులు అందిస్తామని ప్రధానమంత్రి మోడీ కార్యాలయానికి లేఖ రాశామ‌ని తెలిపారు.


ఆపరేషన్ సింధూరతో దేశం మొత్తం గర్వపడాలి .. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల రిజిస్టర్ చేసిన ట్రక్కులను ఉచితంగా సైన్యా నికి అందించేందుకు సిద్ధం చేసి ఉంచాం .. సరిహద్దు ప్రాంతంలో మన సైన్యం ప్రదర్శించే ధైర్య సాహసాల వల్లే ప్రజల సురక్షితంగా ఉంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలోను సుమారుగా 1000 ట్రక్కులను మోవులోని ఆర్మీ కంటోన్మెంట్ కు అప్పగించమని ఈ సందర్భంగా ముకాఠి తెలిపారు. ఏదేమైనా ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఒకే రాష్ట్రం నుంచి ఏకంగా 7.5 ల‌క్ష‌ల ట్ర‌క్కులు సైన్యానికి అంద‌డం అంటే గ్రేట్ అని చెప్పాలి. ఈ స్ఫూర్తి తో ప్ర‌తి ఒక్క‌రు సైన్యానికి త‌మ వంతుగా సాయం చేయాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: