ప్రస్తుతం భారత్ మరియు పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పాకిస్థాన్ కి సంబంధించిన కొంటాందు ఉగ్రవాదులు అమాయకులైన భారతీయుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. దానితో భారత ప్రభుత్వం ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టింది. దానితో పాకిస్తాన్ ప్రభుత్వం , భారత్ చేసిన దాడిలో మా దేశానికి సంబంధించిన అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అని దానితో మేము కూడా భారత్ పై దాడులను చేయడం మొదలు పెడతాం అని ప్రకటించి. .. చెప్పినట్లుగానే భారత్ పై దాడిని మొదలు పెట్టింది.

ఇకపోతే పాకిస్తాన్ ఇలాగే భారత్ పై దాడులను కొనసాగించినట్లయితే ఆ దేశ పరిస్థితి మరింత దారుణస్థితికి వెళుతుంది అని అనేక మంది నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పాకిస్తాన్ కి యుద్ధాన్ని భరించే పరిస్థితి ఏ మాత్రం లేదు అని , ఇప్పటికే అంతర్గత ఖజానా పూర్తిగా ఖాళీ అయి చాలా కాలం అవుతుంది అని , ఆహార పదార్థాల నుంచి పెట్రోల్ వరకు అనేక నిత్యావసరాల కోసం దిగుబత్తులపైనే ఆధారపడి ఆ దేశానికి విదేశీ మారకద్రవ్యా నిలువలు కూడా అత్యంత అవసరం అని , అవి కూడా ఇప్పటికే దాదాపు దగ్గరపడ్డాయి అని , ప్రస్తుతం ఉన్న నిల్వలు కేవలం మూడు నెలలకు మాత్రమే సరిపోతాయి అని ,  ఇలా పాకిస్తాన్ కి అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయి అని ,  దానితో పాకిస్తాన్ గనుక భారత్ తో అనేక రోజుల పాటు యుద్ధాన్ని కొనసాగించినట్లయితే ఆ దేశం ఆర్థికంగా మరింత నష్టాల్లోకి వెళుతుంది అని , యుద్ధం అనంతరం కూడా ఆ దేశం కోలుకోవడానికి అత్యంత ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉంది అని అనేక మంది నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

మరి ఇన్ని ప్రతికూల అంశాల మధ్య పాకిస్తాన్ ,  భారత్ తో అనేక రోజుల పాటు యుద్ధాన్ని కొనసాగిస్తుందా ..? లేక యుద్ధం విషయంలో వెనక్కు తగ్గుతుందా అనేది చూడాలి. ఏదేమైనా కూడా ప్రస్తుతం భారత్ ఆర్మీ చేస్తున్న దాడులకు పాకిస్థాన్ వనికి పోతుంది. పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారతదేశ ఆర్మీ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: